“కాల్మనీ గాళ్ళకి , సెక్స్ రాకెట్ గాళ్ళకి , బ్రోకర్లకు అడ్డాగా తెలుగు దేశం ” కేశినేని నాని

“కాల్మనీ గాళ్ళకి , సెక్స్ రాకెట్ గాళ్ళకి , బ్రోకర్లకు అడ్డాగా తెలుగు దేశం ” కేశినేని నాని

తెలుగు దేశం పార్టీలో అంతర్గత పోరు రచ్చ కెక్కి ఇప్పుడు చంద్ర బాబు నాయుడు కు తలనొప్పిగా మారింది .

అసలే పార్టీ అధికారంలోకి రాక , అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్ అవమానాలకు , అవహేళనకు మనస్తాపంతో వున్న తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు రెండు రోజులన్నా ప్రశాంతంగా గడుపుదామని హైదరాబాద్ వస్తే అంతలోనే తెలుగు తమ్ముళ్లు ట్విట్టర్ సాక్షిగా ఒకరిపై మరొకరు బురద చల్లుకుంటూ బజారు కెక్కారు .

ఆదివారం రోజు విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని , విజవాడ నగర తెలుగు దేశం అధ్యక్షుడు బుద్దా వెంకన్న ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు . “నువ్వు వై .సి .పి లోకి వెళ్ళడానికి విజయ సాయి రెడ్డిని కలవడం నిజం కాదా ? ఇప్పటివరకు చంద్ర బాబు దగ్గర వున్ననువ్వు పార్టీ మారడానికి వ్యూత్మకంగా అడుగులు వేయడం లేదా ?” అంటూ నాని బుద్ధా వెంకన్న పై ట్వీట్ చేశాడు .

“పార్టీ తీవ్రమైన ఇబ్బందుల్లో వున్నప్పుడు .. సైనికుడిగా పనిచేయాల్సిన నువ్వు ఇతర పార్టీలవారితో చేతులు కలిపినా మాట నిజం కాదా ?పార్టీకి కావలసింది నీలాంటి అవకాశవాదులు కాదు , పార్టీ కోసం చివరి క్షణం వరకు పోరాడే యోధులు ” అని వెంకన్న ఘాటుగా స్పందించాడు . అయితే దీనిపై నాని తీవ్రంగా ప్రతిస్పనందించాడు . “రాజకీయ జన్మలు , రాజకీయ పునర్జన్మలు , రాజకీయ భవిష్యత్తులు , గుళ్లో కొబ్బరి చిప్ప దొంగలకి , సైకిల బెల్లుల దొంగలికి, కాల్మనీ గాళ్ళకి , సెక్స్ రాకెట్ గాళ్ళకి , బ్రోకర్లకు , పైరవీదారులకు అవసరం … నాకు అవసరం లేదు “అని పరోక్షముగా బాబుకు చురకలు అంటించాడు .

” చంద్ర బాబు గారు … మీకు నాలాంటి నాయకులు పార్టీకి అవసరం లేదని భావిస్తే … ఆ విషయం తెలియజేయండి …
నేను నా పార్లమెంట్ స్థానానికి … పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను నాలాంటివారు పార్టీకి అవసరమని మీరు భావిస్తే .. మీ పెంపుడు కుక్కను అదుపు చెయ్యండి ” అని అల్టిమేటం ఇచ్చాడు .

అయితే ఈ ఇద్దరు నాయకులు కూడా తెలుగు దేశం పార్టీని వదిలి పెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారా ? అనిపిస్తుంది . కేశినేని నాని ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తో సన్నిహితంగా ఉంటున్నాడు , కొంత కాలంగా తెలుగు దేశం లో క్రియాశీలకముగా ఉండటం లేదు . ఇక బుద్ధా వెంకన్న కూడా వై .ఎస్ . ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తుంది .
ఈ ఘటనతో చంద్ర బాబు మరింత మనస్తాపాకికి గురై, పార్టీలో వున్న కొద్దిమంది నాయకులను ఎలా నిలబెట్టుకోవాలని బాబు సతమతమవుతున్నాడని తెలుస్తుంది .