కేశినేని నాని.! వైఎస్ జగన్‌కి నమ్మకస్తుడు కానే కాడు.!

విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన త్వరలో వైసీపీలో చేరనున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కేశినేని నాని కలిశారు. జగన్‌ని కలవడంతోనే, కేశినేని నానికి విజయవాడ ఎంపీ టిక్కెట్ ఖాయమైంది వైసీపీ తరఫున.

ఇది నిజంగానే చాలా పెద్ద మ్యాజిక్.! నిజానికి, విజయవాడ ఎంపీ సీటు హామీతోనే కేశినేని నాని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీడీపీ నుంచి టిక్కెట్ రాదని తెలిసి, ఆయన పార్టీ మారారన్నది బహిరంగ రహస్యం. కేశినేని నానితోపాటు మరో నలుగురికి వైసీపీ టిక్కెట్లు కేటాయించాల్సి వుంది.. అయితే, అవన్నీ అసెంబ్లీ టిక్కెట్లే.

కానీ, ఓ ఇద్దరికి మాత్రమే, వైఎస్ జగన్ టిక్కెట్లు కేటాయించేలా కేశినేని నానిని ఒప్పించారట. ఏం జరిగినాసరే, కేశినేని నానిని మాత్రం వైఎస్ జగన్ నమ్మడానికి వీల్లేదంటూ వైసీపీలో చాలామంది నేతలు అభిప్రాయపడుతున్నారు.

మొదటి నుంచీ కేశినేని నాని రాజకీయ ప్రస్తానం, వెన్నుపోట్ల మయమే. ప్రజారాజ్యం పార్టీకి కేశినేని నాని వెన్నుపోటు పొడిచిన వైనం అందరికీ తెలిసిందే. టీడీపీలో ఏనాడూ ఆయన నిఖార్సయిన టీడీపీ నేతగా వ్యవహరించింది లేదు. రేప్పొద్దున్న వైసీపీలో కూడా కేశినేని నాని తీరు అలాగే వుంటుందా.? ఇందులో డౌటేముంది.? ఆయన తీరే అంత.

అయితే, ఎవరితో ఎలా వ్యవహరించాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాగా తెలుసు. కమ్మ సామాజిక వర్గం నుంచి వైసీపీ మీద వ్యతిరేకత రాకుండా వ్యూహాత్మకంగా కమ్మ సామాజిక వర్గ నేతలకు గాలం వేస్తోంది వైసీపీ.

కేశినేని నాని వైసీపీలో చేరడంతో, కమ్మ సామాజిక వర్గంలో అలజడి రేగింది. అందుక్కారణం, విజయవాడ పార్లమెంటు పరిధిలో, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకూ ఎన్నికల ఖర్చుని భరించే శక్తి కేశినేని నానికి వుంది మరి.! అయినాగానీ, కేశినేని నానిని రాజకీయంగా నమ్మడానికి వీల్లేదు.! మరి, ఈ సంకట స్థితి నుంచి జగన్ ఎలా గట్టెక్కుతారో ఏమో.!