తెలంగాణ మోడల్ లోనే దేశ రాజకీయాలు మారుస్తా : కేసిఆర్

తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ తెలంగాణ సిఎం కేసిఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోశించబోతున్నట్లు చెప్పారు. అతి త్వరలో ఢిల్లీకి పోయి ఫెడరల్ ఫ్రంట్ బలోపేతం దిశగా ప్రయత్నాలు చేస్తానని చెప్పారు. నాన్ కాంగ్రెస్, నాన్ బిజెపి ఫ్రంట్ ఏర్పాటు దిశగా తమ ప్రయత్నం ఉంటుందన్నారు. తెలంగాణలో అతి త్వరలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని ప్రకటించారు.

తెలంగాణ ప్రజల విజయం. రైతులు, మహిళలు, వెనుకబడిన వర్గాల ప్రజలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు కులాలు, మతాలకు అతీతంగా విజయం అందించారు. ఈ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శిరస్సు వంచి 

టిఆర్ఎస్ కార్యకర్తలు అహో రాత్రులు పనిచేసి మంచి విజయం సాధించారు.

అనుకువ, వినయం, విధేయత అవసరం. అహంకారం ఉండాల్సిన అవసరం లేదు. ఎన్నికలప్పుడు ఏదో మాట్లాడతారు. అంతిమ తీర్పు ప్రజలు ఇచ్చారు కాబట్టి మనం బాధ్యత నెరవేర్చాలి.

కొత్త రాష్ట్రంలో మనం గమ్యం చేరాలి. మనం ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో దాన్ని చేరుకోవాలి. కోటి ఎకరాలు పచ్చబడాలి తెలంగాణలో అది అయి తీరాలి.

ఎన్నికల చివరి దశలో నేను ఒక మాట చెప్పిన. టిఆర్ఎస్ ను గెలిపిస్తే కాళేశ్వరం, కూటమిని గెలిపిస్తే శనేశ్వరం అని చెప్పిన. ప్రజలు కాళేశ్వరమే కావాలని తీర్పు ఇచ్చిర్రు. ఆ ఆకాంక్ష నెరవేరాలి. ధనికులైన రైతులు తెలంగాణలో ఉన్నారు అని నిరూపించాలి. నిశ్చింతగా గర్వంగా వారు వ్యవసాయం చేసుకునేరోజు వచ్చేలా పనిచేద్దాం.

గిరిజనులు, వారి పోడు భూముల సమస్యను వీలైనంత తొందరగా పరిష్కారం చేస్తాం. నేను చొరవ చూపుతాను.

నేను కోరుకున్న తెలంగాణ రావాలి. బీడీ కార్మికులు, కుమ్మరులు, చేనేత వృత్తిదారులు బాగుపడాలి.

నిరుద్యోగ సమస్య యావత్ భారతేదశంలో ఉన్న సమస్య. ఉద్యోగ ఖాళీలు అన్నీ అత్యంత వేగంగా భర్తీ చేస్తాము. సిన్సియర్ గా భర్తీ చేస్తాము. వీలైనంత తొందరగా భర్తీ చేస్తాము. ఎవరూ అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు.

ప్రభుత్వేతర రంగంలో కూడా ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తాము.

విజయం ఎంత ఘనంగా ఉందో బాధ్యత కూడా భారం గా ఉంది. అందుకే బాధ్యతతో పనిచేస్తాము.

సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా పనిచేస్తాము. ప్రతి వ్యక్తి ఆరోగ్య రికార్డు చేయబోతున్నాం. 

మైనార్టీల కోసం ఇండియాలో ఏ ప్రభుత్వం పెట్టని బడ్జెట్ తెలంగాణలో పెట్టినం. తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల మైనార్టీలను కడుపులో పెట్టుకుని చూసుకుంటాము.

మరీ ముఖ్యంగా దళితుల అభ్యున్నతి కోసం ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో కమిటీ వేసినం. దళితులు, గిరిజనుల పేదరికం పోవడానికి ఖచ్చితమైన పనులు చేస్తాము. పేదరికం ఎవరికైనా సమానమే. అందరినీ దహించివేస్తున్నది. పేదరికంలో కులం, మతం లేదు. అందరూ సమానమే. పేదరికం ఎవరినైనా వేధిస్తది.

రెసిడెన్సియల్ పాఠశాలల్లో మాకు కూడా సీట్లు కావాలని అగ్రవర్ణాల వారు వచ్చి అడిగారు. రెసిడెన్సియల్ స్కూళ్లు అంటే డిమాండ్ వచ్చిందని అప్పుడు అర్థమైంది.

పేదరిక నిర్మూలన ప్రధాన ఇతివృత్తంగా ప్రణాళికలు జరుగుతాయి. సింగిల్ బూత్ లో రీపోలింగ్ లేకుండా తెలంగాణలో ప్రశాంతవాతావరణంలో ఎన్నికలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు ఇంత ప్రశాంతంగా జరిగాయి. ఇది రికార్డు. తుపాకుల మోతలు లేవు. చనిపోయి ఎన్నికలు ఆగిపోయిన ఘటన లేదు. లా అండ్ ఆర్డర్ నిర్వహణలో సింగిల్ ఇన్సిడెన్స్ లేకుండా ఎన్నికలు జరిపారు. పోలీసు యంత్రాంగం, ఎన్నికల యంత్రాంగం, ఈసి అందరికీ అభినందనలు. సిఇఓ రజత్ కుమార్ కు ధన్యవాదాలు. 

మీడియా కూడా మంచి రోల్ ప్లే చేసింది. గౌరవప్రదమైన బేస్ ఇక్కడ ఉంది అనేలా మీడియా పనిచేసింది. రాష్ట్రం పరిపక్వతను ప్రదర్శించడంలో మీడియా బాగా పనిచేసింది.

ఇక పై దేశ రాజకీయాల్లో మనం పాత్ర వహిచాల్సిన అవసరం ఉంటది. మనకు ప్రేక్షక పాత్ర అవసరం లేదు. 116 సభల్లో నేను పాల్గొన్నాను. ప్రతి మీటింగ్ లో ప్రజలే గెలవాలె తప్ప పార్టీలు కాదని అప్పీల్ చేసిన. ఈరోజు ప్రజలు గెలిచిర్రు. ఎన్ని ప్రచారాలు జరిగినా ఏం జరిగినా.. ప్రజలే గెలిచారు.

ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, సిపిఐ, సిపిఎం వారు వచ్చారు. వారు చెప్పేది చెప్పారు. అంతిమ నిర్ణయం ప్రజలు ఇచ్చారు. 

ఉదయం కూడా చాలా మంది మాట్లాడారు. మమతా బెనర్జీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోశిస్తాము. ఈ దేశానికి దిక్సూచి తెలంగాణ. దేశ రాజకీయాల్లో తెలంగాణ అవసరం ఉంది. దేశంలో చాలా కన్ఫ్యూజన్ ఉన్నది. ఎవరు ఏమనుకుంటారు? ఎవరు ఏమనుకోరు అన్నది నాకు అవసరం. వందకు వంద శాతం ఈ దేశంలో నాన్ కాంగ్రెస్, నాన్ బిజెపి పాలన రావాల్సిన అవసరం ఉంది. 

మేము పూర్తిగా తెలంగాణ ప్రజలకు ఏజెంట్లం. మేము ఎవరికీ గులాంగిరీ చేయము. ఇక్కడ ప్రజల ఆకాంక్షలకు గులాములం. ఈ దేశానికి 70 వేల టిఎంసీల నీళ్లు అందుబాటులో ఉండాలి. మనం వాడుకుంటున్నది. 30వేలు కూడా వాడుకోవడంలేదు. సిగ్గు ఉండాలి. కాంగ్రెస్, బిజెపి నేతలకు. దేశానికి కొత్త ఆర్థిక విధానం అవసరం ఉంది.

చైనా లాంటి దేశాలతో పోల్చుకుంటే మనం చాలా వెనుకబడి ఉన్నాము. నేను అతి త్వరలో ఢిల్లీ వెళ్లబోతున్నాను. 15 కోట్ల రైతులు ఈ దేశంలో ఉన్నారు. వాళ్ల గతి అన్నమో రామచంద్రాఅ ని ఉన్నారు. వాళ్లను పట్టించుకున్నవారు లేరు. రైతులకు నాలుగు వేలు ఇచ్చినం. ఐదు వేలు ఇస్తామంటున్నం. దానివల్ల రైతులకు ఫ్రీడం వచ్చింది. స్వామినాథన్ సూచించిన స్కీమ్ ఇది. 

దేశం

దేశంలో డర్టీ పార్టీలు ఉన్నాయి. నాలుగు పార్టీలు కలిపి ఒక డ్రామా చేశాయి. పార్టీలను హేళన చేయడం కాదు. దళితులు, బిసిలు, ఎస్టీలు నేడు టిఆర్ఎస్ కు సపోర్ట్ చేశారు. పాజిటీవ్ ఓటుతో గెలిచాము. 15, 16 సీట్లు మా పార్టీ వారి వైఖరి వల్ల ఓడిపోయాము. ఖమ్మం దానికి ఉదాహరణ. అక్కడ మా పార్టీ వారు ఒకరినొకరు కలిసి పనిచేయక ఓడిపోయారు. 

అసదుద్దీన్ ఓవైసికి ధన్యవాదాలు. ఆయన నేను కలిసి భోజనం చేసి నాలుగైదు గంటలు మాట్లాడుకున్నాం. చాలా మంది థర్డ్ క్లాస్ కామెంట్స్ చేశారు. మేము మాట్లాడుకున్నది జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుకున్నం. మేము మాట్లాడుకున్నది ఒకటైతే ఏవేవో విమర్శలు చేశారు. 

ఇండియా అంటే ప్రపంచ దేశాలకు చులకన భావం ఉంది. ఏం జరిగింది. ఇప్పుడు మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచింది. అయితే వాళ్లు, లేదంటే వీళ్లు కానీ ఆల్ట్రనేట్ లేదు. తెలంగాణలో ఏది అనుసరించామో రేపు దేశంలో కూడా అదే అనుసరించాలి. దేశంలోని ప్రజలంతా గుండెమీద చేయి వేసుకుని ప్రశాంతంగా ఉండేలా చూడాలి.

70వేల టిఎంసిలు ఉంటే 30 నుంచి 32 వేలు టిఎంసిలు మాత్రమే వాడాము. దీని మీద సిగ్గు పడాల్సిందిపోయి జబ్జలు చరుసుకునుడు ఎందుకు? సిగ్గుపడాలి. నేషనల్ ఫ్రంట్ అని నేను ఎప్పుడైతే చెప్పానో దానికోసం ప్రయత్నం చేస్తాము. మేము ప్రజలను ఏకం చేస్తాము. పార్టీలను కాదు. గులాబీ జెండా ఎగురవేసినప్పుడు కూడా కొందరు హేళన చేశారు. కానీ రాష్ట్రం వచ్చింది. రెండోసారి అధికారంలోకి వచ్చింది. 

బాధ్యత, నిర్మాణాత్మక శక్తి ఉన్నవారు దేశం కోసం పనిచేయాల్సిందే. నేను చేస్తాను. రాబోయే నెలరోజుల్లో చూస్తారు. అద్భుతమైన గుణాత్మక మార్పు మీరు దేశంలో చూడబోతున్నారు. తక్కువ సమయంలోనే నేను చాలా మందిని కలుస్తాను. మాట్లాడుతాను. నాన్ కాంగ్రెస్, నాన్ బిజెపి శ్రేణులను ఏకం చేస్తాను. దేశ ప్రజలకు తాగునీరు ఇవ్వకపోయినందుకు సిగ్గుపడాలి. కాంగ్రెస్ ముక్తా భారత్, బిజెపి ముక్తా భారత్ కావాలి.

గొప్ప ఆలోచనలతో పనిచేద్దాం. గొప్ప ప్రయత్నం చేద్దాము. దేశానికి మనం కొంత పనిచేద్దాం. కంట్రిబ్యూట్ చేద్దాం. ఏ రూపంలో అయినా చేద్దాం. 

రేపు 11.30 గంటలకు శాసనసభా పక్షం సమావేశం ఉంటుంది. కొత్త గవర్నమెంట్ రాగానే కేబినెట్ జరగాల్సిందే కదా? ఎన్డీటివి ప్రణయ్ రాయ్, ఇండియాటుడే రాజ్ దీప్ సర్దేశాయ్ వచ్చారు. వారు ఒక్కటే చెప్పారు. కానీ తెలంగాణలో ప్రతిపక్షం పేరిట ఆ పార్టీలు చేస్తున్న చికాకులు అతి మూర్ఖంగా ఉన్నాయి. నిరాధార ఆరోపణలు , పిచ్చి ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రం దాని నుంచి బయటకు రావాలి. కోటి ఎకరాలకు నీళ్లు రావాలి. కోటి ఎకరాలకు నీళ్లు వస్తే ఎలా ఉంటుంది? 

మహబూబ్ నగర్ లో పోయిన. వలసలతో విలవిలలాడిన పాలమూరు తల్లి అని పద్యాలు రాశారు. కానీ ఆ పరిస్థితి మారాలి. తమిళనాడు పోయినప్పుడు నేను స్టాలిన్ కు ఒక్కటే చెప్పిన. మీ అంతటా మీరే గొర్రెల మాదిరిగా నేను నాన్ బిజెపి, నాన్ కాంగ్రెస్ అని ఎందుకు పోతారు అని అడిగిన. గద్వాలలోని గట్టు మండలంలో ప్రాథమిక పాఠశాల మీద ఢిల్లీ పెత్తనం అవసరమా? మాకు లేదా తెలివి? పాకిస్తాన్ తో సమస్య పరిష్కరించలేరు కానీ విద్య, వైద్యం మీద ఢిల్లీకి పెత్తనం అవసరమా? 

ప్రజల ఎమోషన్స్ స్థాయికి ప్రభుత్వాలు ఎదగాలి అని నేను ప్రధానమంత్రికి చెప్పిన. మేము చెయ్యము. గిరిజనులు, మైనార్టీల రిజర్వేషన్లు కానీయం అంటే నీ అయ్య జాగీరా? సిఎం ఎక్కడుంటే అదే సెక్రటేరియట్. ఇంత పెద్ద దేశంలో ఒక్క సుప్రీంకోర్టు పెడతారా? ఈ దేశంలో ప్రజలను అగౌరవపరిచే పద్ధతి పోవాలి. ప్రజలను సమానంగ చూసే పద్ధతి రావాలి. 

మీరు ఎపి రాజకీయాల్లో కలగజేసుకోవాలని అడుగుతున్నారు చాలామంది. వంద శాతం దేశ రాజకీయాలు బాగు చేసే ప్రయత్నంలో భాగంగా మేము ఎపి రాజకీయాల్లో కలగజేసుకోవాల్సిందే. చంద్రబాబుకు నేను గిఫ్ట్ ఇవ్వాలి కదా?

మనం బర్త్ డే పార్టీ చేస్తే రిటర్న్ గిఫ్ట్ ఇస్తమా? లేదా? చంద్రబాబు నాయుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ కు నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే తెలంగాణ వారు సంస్కారహీనులు అంటారు. నేను కచ్చితంగా నేను గిఫ్ట్ ఇస్తాను నా స్నేహితుడు చంద్రబాబుకు.

ఆయనకు పైత్యం ఉన్నది. కలపడ్డది నరేంద్ర మోదీ సంకన చేరిండు. ఎన్ క్యాష్ చేసుకున్నడు. చెప్తే బాగుండదు. కానీ ఇప్పుడు చెప్పను. రేపు చెప్తా. పొగిడేందుకు కూడా హద్దు లేని రీతిలో పొగిడిండు. అతిగా పొగడబోయి మోదీని చాలాసార్లు బోల్తా పడ్డడు. ఓవర్ యాంగ్జయిటీలో నరేంద్ర మోదీని పొగడబోయి బోల్తా పడ్డడు. ఫైనాన్స్ కమిషన్ అనేది ఒకటి ఉంటది. దాని రిపోర్ట్ అమలు చేస్తారు. 

నేను కూడా నీతి అయోగ్ లో ఉన్నాను కదా? ఒక మీటింగ్ లో ఏం చెప్పిండో తెలుసా? నా పక్కన అఖిలేష్ యాదవ్ కూసున్నడు. దేశమంతా తిరిగి ఒక మోడల్ తయారు చేసి ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఇస్తది. కేంద్రం ఆ రిపోర్ట్ అమలు చేస్తది. కొన్ని చేయరు. కేంద్రం డెవల్యూషన్ ను 42 శాతం పెంచాలని రికమండ్ చేసిర్రు. దాన్ని చంద్రబాబు పొగిడిండు. మోదీ ఇంద్రుడు, చంద్రుడు అని పొగిడిండు. మోదీ పాయకాన పోతే వాసన రాదు అన్నట్లు పొగిడిండు. మొదటిసారి ఒక ముఖ్యమంత్రి ప్రధాని అయిండు కాబట్టి ఇట్లా పెంచిండు అని మోదీని పొగిడిండు. కానీ అఖిలేష్ సహా అందరూ నవ్విర్రు. గతంలో పివి నర్సింహ్మారావు, మొరార్జీ దేశాయ్ పెంచిర్రు కదా? ఈయనేంది ఇట్లా అంటుండు అని అన్నరు. నేను చానా చెప్పాల్సి ఉంది చంద్రబాబు గురించి విజయవాడలోనే చెబుతాను.