వైసిపి ఎంఎల్ఏ, ఏపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా ఇంటికి తెలంగాణా సిఎం కెసియార్ వెళ్ళటం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. తమిళనాడులోని కంచి ఆలయానికి కెసియార్ కుటుంబ సభ్యులతో పాటు వెళ్ళారు. రేణిగుంట విమానాశ్రయం వరకూ విమానంలో వెళ్ళిన కెసియార్ అక్కడి నుండి కంచికి రోడ్డు మార్గంలో వెళ్ళారు.
రేణిగుంట-కంచికి మధ్యలో నగిరి వస్తుంది. అంటే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అన్నమాట. కాబట్టే తమ ఇంటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించాలని రోజా రిక్వెస్టు చేసినట్లు సమాచారం. వెంటనే కెసియార్ అంగీకరించారు. ఇప్పటికి రెండుసార్లు కెసియార్ కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనార్ధం తిరుపతికి వెళ్ళారు. అయితే చంద్రగిరి ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరెడ్డి ఇంటికి వెళ్ళినా ఈ స్ధాయిలో ఆతిధ్యం తీసుకోలేదు.
మొదటిసారి కెసియార్ నగిరి ఎంఎల్ఏ రోజా ఇంటికి వెళ్ళి బ్రేక్ ఫాస్ట్ చేసి కంచికి వెళ్ళారు. మళ్ళీ తిరుగు ప్రయాణంలో కూడా నగిరిలోని రోజా ఇంటిలోనే ఆగి భోజనం కూడా చేస్తారు. సరే ఓ సిఎం తన ఇంటికి వస్తున్నారంటే ఏర్పాట్లు భారీ ఎత్తున ఉండటం సహజమే కదా ? కాబట్టి రోజా కూడా అలాగే ఏర్పాట్లు చేసింది.