వైసీపీ ఎమ్మెల్యేలలో అంతమందికి షాక్ తప్పదా.. జగన్ ప్లానింగ్ ఇదేనా?

2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం సీఎం జగన్ సైతం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విమర్శలు వస్తున్నా ఆ నిర్ణయాల విషయంలో వెనక్కు తగ్గితే పోయేది వైసీపీ పరువేనని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లా అధ్యక్షులను మార్చిన జగన్ అతి త్వరలో కొన్ని ముఖ్యమైన అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థుల మార్పు దిశగా అడుగులు వేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

పనితీరు మెరుగుపరచుకోకపోతే కొత్త ఇంఛార్జులను నియమిస్తానని జగన్ ఇప్పటికే ఎమ్మెల్యేలకు సూచనలు చేశారని సమాచారం. ఇప్పటికే 27 మంది ఎమ్మెల్యేలకు పనితీరు మార్చుకోవాలని జగన్ సూచనలు చేశారు. పనితీరు మార్చుకోని పక్షంలో మీకు ఇబ్బందులు తప్పవని వాళ్లను హెచ్చరించారు. 50 మంది ఎమ్మెల్యేలకు బదులుగా కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తున్నారని సమాచారం.

నియోజకవర్గ ప్రజల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎమ్మెల్యేలకు భారీ షాక్ తప్పదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ ప్లానింగ్ ఒక విధంగా రైటే అయినా టికెట్లు లభించని అభ్యర్థులు వైసీపీ ఓటమికి కృషి చేసే ఛాన్స్ అయితే ఉంది. అదే సమయంలో రెబల్స్ గా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. జగన్ టికెట్లు ఇవ్వని అభ్యర్థులపై ఇతర పార్టీలు సైతం దృష్టి పెడుతున్నాయి.

జగన్ ఏ చిన్న పొరపాటు చేసినా ఆ పొరపాటు పార్టీకి శాపం కానుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ 2019 మ్యాజిక్ ను 2024 ఎన్నికల్లో రిపీట్ చేయాలని వైసీపీ అభిమానులు భావిస్తుండగా ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.