AP: మీ శిష్యుడు శ్రీ శైలంను ఖాళీ చేస్తున్నాడు బాబు… మీరేం చేస్తున్నారు: వైకాపా ఎమ్మెల్యే

AP: ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు అయినటువంటి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి పై ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ చంద్రబాబు పట్ల మండిపడ్డారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి పూర్తిగా హక్కులు ఉన్నటువంటి శ్రీశైలం జలాశయం పట్ల ఈయన పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది. చంద్రబాబు గారు పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీ శిష్యుడు శ్రీశైలం జలాశయాన్ని మొత్తం ఖాళీ చేస్తున్నారు.

ఎడమ విద్యుత్ కేంద్రంలో యదేచ్చగా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని తెలంగాణ సర్కార్‌ పై ఫైర్‌ అయ్యారు. యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. మన రాష్ట్రానికి దిగువన నీటి అవసరాలు ఉంటే తెలంగాణ 35,315 క్యూసెక్కుల నీటిని తరలిస్తుంటే చోద్యం చూస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు అంటూ ఈయన చంద్రబాబు నాయుడుని ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇలా విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా తెలంగాణ ఎడమ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నప్పటికీ కూడా ఏపీ ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేయడం వెనుక ఆంతర్యం ఏంటి అనే ప్రశ్న అందరిలోనూ కలుగుతుంది. మరి ఎమ్మెల్యే చేసినటువంటి ఈ పోస్ట్ పట్ల కూటమి నేతలు ఏ విధంగా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది.