జగన్ పని అవుట్.. ఏకంగా 30 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరనున్నారా?

ఈ మధ్య కాలంలో వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. క్రాస్ ఓటింగ్ వల్ల మరోసారి వైసీపీకి షాకింగ్ ఫలితాలు వచ్చాయనే సంగతి తెలిసిందే. ఓటమి విషయంలో వైసీపీ ఎంతగానో ఫీలవుతోంది. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి వైసీపీకి షాకిచ్చారని కామెంట్లు వినిపిస్తున్నాయి. టికెట్లు దక్కని ఎమ్మెల్యేలు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నా పెద్దగా ఫలితం అయితే ఉండదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే టీడీపీలోకి ఏకంగా 30 మంది వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లనున్నరని జరుగుతున్న ప్రచారం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. అయితే వైసీపీ టికెట్లు ఇవ్వని ఎమ్మెల్యేలు టీడీపీపై దృష్టి పెట్టారని కామెంట్లు వినిపిస్తున్నాయి. క్రాస్ ఓటింగ్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జగన్ కు షాకిచ్చే దిశగా వైసీపీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు అడుగులు వేస్తున్నారు. 2024 ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో చూడాలి. వైసీపీపై ప్రజల్లో సైతం అంతకంతకూ అసంతృప్తి పెరుగుతోంది. వేర్వేరు కారణాల వల్ల ఈ అసంతృప్తి పెరుగుతుండటం గమనార్హం. క్రాస్ ఓటింగ్ గురించి జగన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. మరోవైపు జగన్ ప్రజల్లోకి రావాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.

జగన్ సైతం కొన్ని విషయాలకు సంబంధించి మారాల్సిన తరుణం ఆసన్నమైంది. ప్రజల్లో ఏర్పడుతున్న నెగిటివిటీని అధిగమించాల్సి ఉంది. జగన్ కు వచ్చే ఎన్నికల్లో కూడా అనుకూల ఫలితాలు వస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.