పాఠశాలలలో చదివే విద్యార్థులలో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థి పేపర్ లో ప్రశ్నలు కఠినంగా ఉండటం వల్ల తనకు మార్కులు తగ్గాయని ఎక్కువ మార్కులు వస్తే మాత్రం అంతా తన కష్టానికి దక్కిన ప్రతిఫలం అని చెబుతుంటారు. అయితే గతంలో చంద్రబాబు, ప్రస్తుతం కేసీఆర్ కూడా ఈవీఎంల విషయంలో ఇలాంటి ఆరోపణలు చేస్తుండటం గమనార్హం. ఈవీఎంలతో ఎన్నికలను నిర్వహించడం వల్ల ఎన్నికల కమిషన్ కు పని సులువు అవుతోంది.
అయితే ఈవీఎంలపై గతంలో చంద్రబాబు అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఈవీఎంల వల్లే తాను ఎన్నికల్లో ఓడిపోయాననే విధంగా ప్రచారం చేసుకున్నారు. ఈవీఎంలను మ్యానిప్యులేట్ చేయొచ్చని ప్రూవ్ చేస్తామని చెప్పినా వాస్తవంగా ఆ విధంగా ప్రూవ్ చేయడంలో ఫెయిలయ్యారు. ప్రస్తుతం కేసీఆర్ కూడా ఇవే ఆరోపణలు చేస్తుండటం గమనార్హం.
ఈవీఎంల విషయంలో పోరాటం చేయాలని కేసీఆర్ ఫిక్స్ అయ్యారు. అయితే ఆయన ఏ విధంగా పోరాటం చేయబోతున్నారనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణలో రెండుసార్లు టీ.ఆర్.ఎస్. పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఇతర పార్టీల నేతలెవరూ ఈవీఎంల విషయంలో తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పలేదు.
ఇప్పుడు కేసీఆర్ మాత్రం ఈవీఎంల విషయంలో ఆరోపణలు చేస్తుండటంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీ.ఆర్.ఎస్ గెలుస్తుందని
కేసీఆర్ కు నమ్మకం లేదని అందువల్లే ఈ తరహా కామెంట్లు చేస్తున్నారని నెటిజన్లలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2024 ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. అభివృద్ధి చేయడంతో పాటు సంక్షేమ పథకాలను అమలు చేస్తే పార్టీ అధికారంలోకి వస్తుందని ఈవీఎంలపై విమర్శలు చేయడం వల్ల లాభం ఏంటని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.