నిబద్ధతకు అర్ధమేంది కవితక్కా

ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో తెలంగాణ సిద్దాంతకర్త  ప్రొఫెసర్ జయశంకర్ సార్ 84వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా టిఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి హజరయ్యారు.  ఎంపీ కవిత మాట్లాడుతూ తెలంగాణ యువత జయశంకర్ సార్ నుంచి నిబద్ధత నేర్చుకోవాలన్నారు. ఎంపీ వినోద్ మాట్లాడుతూ జయశంకర్ గారు బతికుంటే తెలంగాణలో జరుగుతున్నఅభివృద్దిని చూసి ఆనందించి గర్వించేవారన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న కవిత

కవిత మాట్లాడిన నిబద్దత అనే పదానికి సరైన అర్ధం ఏంటని పలువురు తెలంగాణ వాదులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిబద్దత అంటే జయశంకర్ గారి క్రమశిక్షణనా లేక మాట మీద నిలబడటమా ఏది నిబద్దత అని పలువురు తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. అదే నిబద్దత సర్కార్ లో ఉన్నవారు పాటిస్తున్నారా అని పలువురు చర్చించుకున్నారు. కవిత మాట్లాడే ముందు జయశంకర్ గారి నిబద్దత తాను, సీఎం కేసీఆర్ పాటిస్తున్నారా లేదో తెలుసుకొని మాట్లాడాలని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్న జయశంకర్ గారి జయంతి వేడుకల్లో పాల్గొనకపోవడంపై  పలువురు తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. తెలంగాణకు చాలా ముఖ్యమైన వ్యక్తి జయశంకర్ సార్ అని గొప్పలు చెప్పే కేసీఆర్ ఆయన జయంతి వేడుకల్లో పాల్గొనకపోవడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.

 

మాట్లాడుతున్న టిఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, హాజరైన తెలంగాణ వాదులు

ఈ సమావేశానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,  టిఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, తెలంగాణ వాదులు హాజరయ్యారు. ప్రొఫెసర్ జయశంకర్ సారుని తమ యాదిలో తలచుకొని నివాళులర్పించారు.