కర్నూలు బుట్టా రేణుక మాట్లాడిందోచ్

అవిశ్వాస చర్చలో ఎంపీ బుట్టా రేణుక మాట్లాడారు. తలుపులు మూసి రాష్ట్రాన్ని విడగొట్టారని ఇది అన్యాయమన్నారు. ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని  ప్రధాని హామీనిచ్చారని, ప్రధాని ఇచ్చిన హామీని  నిలబెట్టకపోతే పార్లమెంట్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందన్నారు. ఇచ్చిన హామీలన్ని అమలు చేసి తీర్చాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. ఏపికి ప్రత్యేక ప్యాకేజి కాదు, ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని బుట్టా రేణుక స్పష్టం చేశారు.