జీవితమనేది మన నిర్ణయాల యొక్క ఫలితం. ఆ నిర్ణయం యొక్క ఫలితం మన జీవితాన్నే మార్చేయవచ్చు. ఈ ఫలితం జీవితాన్ని అధఃపాతాళానికి పడిపోవచ్చు, లేకపోతే జీవితాన్ని అందలం కూడా ఎక్కించవచ్చు. ఇలా ఒక తాను తీసుకున్న నిర్ణయం వల్ల తన రాజకీయ జీవితాన్ని బుట్ట రేణుక పూర్తిగా నాశనం చేసుకుంది. 2014 ఎన్నికల సమయంలో వైసీపీ నుండి కర్నూల్ లోకసభ స్థానానికి పోటీ చేసింది. అప్పుడు ఆమె పేరు మీడియాలో ఎక్కువగా వినిపించేది. ఆమెకు పెద్దగా రాజకీయ అనుభవం లేకపోయినప్పుటికీ వైసీపీ టికెట్ ఇవ్వడంతో స్వల్ప మెజారిటీతో గెలిచింది. ఈ గెలుపుతో వైసీపీ నాయకులు కూడా ఆమెకు ప్రాధాన్యత ఇచ్చేవారు. తీసుకునే అన్ని నిర్ణయాల్లో ఆమెను ఇన్వాల్వ్ చేసేవారు.
Read More – కుక్కలంటే ఎవరూరుకుంటారు జగన్ సార్? మీ వాళ్ళను అదుపులో పెట్టుకోండి !
ఎన్నికల్లో వైసీపీ తరపున రేణుక తరువాత వైసీపీకి రెబల్ మారి అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీలోకి వెళ్ళడానికి రేణుక ప్రయత్నించారు. అయితే అప్పుడు వైసీపీ నేతలు అడ్డుకున్నారు. అయినా 2017లో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన బుట్ట రేణుకకు పార్టీ సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ 2019 ఎన్నికల్లో టీడీపీ ఆమెకు కనీసం పోటీ చేయడానికి సీటు కూడా ఇవ్వలేదు. దీంతో బుట్ట రేణుక మళ్ళీ వైసీపీలో చేరారు. అయితే పార్టీ ఆమెకు ప్రాధాన్యత ఇవ్వలేదు. రాజకీయాల్లో ఒక్కసారిగా ఎదిగిన బుట్టా రేణుక తాను తీసుకున్న నిర్ణయం వల్ల తన రాజకీయ జీవితం మొత్తం తలకిందులు అయ్యింది. వైసీపీ నుండి గెలిచి, జగన్ కు వెన్నుపోటు పొడవాలని ప్రయత్నించిన బుట్టా రేణుక రాజకీయ ప్రస్థానం ముగిసింది. ఎవరైనా జగన్ కు వెన్నుపోటు పొడవాలని ప్రయత్నించే వాళ్ళు ఒక్కసారి రేణుకకు పట్టిన గతి గురించి ఆలోచించాలని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. జగన్ కు వ్యతిరేకంగా వెళ్లిన రఘురామ కృష్ణరాజు కూడా ప్రస్తుతం బుట్టా రేణుక పొజిషన్ లో ఉన్నారు. రానున్న రోజుల్లో రఘురామ రాజు రాజకీయ జీవితం ఎలా ఉంటుందో చూడాలి.
The political pundits are predicting that Raghu Rama Krishnam Raju will meet the same fate as Butta Renuka due to his rebellious activities.