తెర వెనుక రసవత్తర రాజకీయం నడిపిన బీజేపీ

తెర వెనుక రసవత్తర రాజకీయం నడిపిన బీజేపీ

ఈరోజే కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ లో విశ్వాస పరీక్ష . ఇందుకోసం అసెంబ్లీ దగ్గర పటిస్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు . దేశం దృష్ఠి అంతా ఇప్పుడు కర్ణాటక మీదే వుంది . అయితే ఈ విశ్వాస పరీక్షలో భారతీయ జనతా పార్టీ నెగ్గి యడ్డ్యూరప్ప ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చెయ్యడం ఖాయమైనట్టే . ఎందుకంటే స్పీకర్ కె.ఆర్. రమేష్ కుమార్ చర్య తో 17 మంది శాసన సభ్యులమీద అనర్హత వేటు పడింది . ఆదివారం రోజు 14 మంది మంది అంతకు ముందు 3 సభ్యులను రమేష్ కుమార్ అనర్హులుగా ప్రకటించారు . దీంతో భారతీయ జనతా పార్టీకి విశ్వాస పరీక్షలో మార్గం సుగమం అయిపొయింది .

కర్ణాటక శాసన సభలో మొత్తం సభ్యుల సంఖ్య 224 మంది . వీరిలో 17 మంది మీద వేటు పడిన తరువాత సభలో 207 మంది మాత్రమే వున్నారు . భారతీయ జనతా పార్టీ బలం 105 మంది . కాంగ్రెస్ పార్టీ బలం 13 మంది మీద వేటు తరువాత 65కు పడిపోయింది . ఇక జేడీఎస్ బలం 4 గురిని అనర్హులుగా ప్రకటించిన తరువాత 34 మంది . స్వతంత్ర సభ్యుడు ఒకరు , బిఎస్పీ ఒకరు . ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి కావలసిన మేజిక్ ఫిగర్ 104 మంది . భారతీయ జనతా పార్టీ సభ్యులు 105కు తోడు స్వతంత్ర అభ్యర్థి కూడా బీజేపీకే మద్దతు ఇస్తున్నాడు . అంటే ఈ సంఖ్య 106కు పెరిగింది . కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడాని ఎలాంటి అడ్డంకులు లేవు .

కాంగ్రెస్ పార్టీ , జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం అష్టకష్టాల్తో 14 నెలలలు నెట్టుకొచ్చింది . అప్పటికే జేడీఎస్ నేత కుమారస్వామి విసిగిపోయాడు . కాంగ్రెస్ పార్టీ నుంచి 13 మంది , జేడీఎస్ నుంచి 3, స్వతంత్ర సభ్యుడు ఒకరు మొత్తం 17 మంది సభ్యులు శాసన సభ ముగిసేవరకు అంటే నాలుగు సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీచేసే అర్హత కోల్పోయాడు . రెబల్ గా మారితే గుర్తింపు ,ఊహించనంత డబ్బు వస్తుందని ఆశించిన వారు చిత్తైపోయారు . అనర్హత వేసిన తరువాత కుప్పకూలిపోయారు . స్పీకర్ కె.ఆర్ రమేష్ కుమార్ చర్య వెనుక ఎవరున్నారు ? ఎందుకు రమేష్ కుమారు 17 మంది సభ్యులను అనర్హులుగా ప్రకటించారు ? భారతీయ జనతా పార్టీ తెర వెనుక నాటకాన్ని బాగా రక్తి కట్టించింది . ముందు కూడా ఎలాంటి తలనొప్పులు లేకుండా మైండ్ గేమ్ ఆడింది . కాంగ్రెస్ , జేడీఎస్ కూటమి ని గద్దె దింపేసింది .