ఆ టీడీపీ ఎమ్మెల్యే  జగన్‌కు జైకొట్టింది వైసీపీని డ్యామేజ్ చేయడానికా ?

TDP

ఆంధ్రప్రదేశ్ సీనియర్ రాజకీయ నాయకుల్లో కరణం బలరాం కృష్ణమూర్తి కూడా ఒకరు.  ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తిరుగులేని నేతగా చెలామణీ అవుతున్నారు కరణం బలరాం.  మొదటి కాంగ్రెస్ పార్టీలో ఉంది ఆ తర్వాత టీడీపీలోకి ప్రవేశించిన కారణం బలరాం తక్కువ కాలంలోనే కీలక నేతగా ఎదిగారు.  అద్దంకి, చీరాల నియోజకవర్గాల్లో పూర్తి పట్టు సాధించారు.  ఈ రెండు స్థానాల్లో ఎక్కడి నుండి పోటీచేసినా విజయం సాధించగల సామర్థ్యం ఈయనకుంది.  టీడీపీతో ఈయన అనుబంధం చాలా ప్రత్యేకం.  చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా పేరొందారు.  టీడీపీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రకాశం జిల్లాలో టీడీపీ జెండాను మాత్రం దిగనివ్వలేదు కరణం.  అలాంటి ఆయన ఉన్నట్టుంది టీడీపీని కాదని వైసీపీకి జైకొట్టారు,  తన కుమారుడ్ని అధికారికంగా వైకాపాలో చేర్చిన ఆయన తాను అనధికారికంగా మద్దతిస్తూ ఉన్నారు.  

కరణం ఉన్నట్టుండి ఇలా ప్లేటు ఫిరాయించడంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.  కరణం ఏమిటి చంద్రబాబును వదిలేయడం ఏమిటి, అసలు ఆయన వెళ్తానంటే చంద్రబాబు ఊరుకోరే.  కానీ ఊరుకున్నారు.  ఈ వ్యవహారం వెనుక పెద్ద కథే ఉంది అంటూ అనుమానం వ్యక్తం చేశారు.  కరణం ఎంట్రీతో వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు వారి అనుమానానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.  కరణం ప్రజెంట్ చీరాల వైసీపీ వ్యవహారాల్లో వేలు పెట్టడమే కాదు అద్దంకిలో కూడ పెత్తనం చేస్తున్నారు.  తన కుమారుడు వెంకటేష్ ను అద్దంకి వైసీపీ మీదకు వదిలి ఆయన చీరాల వైసీపీ నెత్తిన కూర్చునే ప్రయత్నాల్లో ఉన్నారు.  అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి టీడీపీని వీడి వైసీపీలోకి వెళతారనే ప్రచారం ఉంది.  అందుకే కరణం తన కుమారుడిని అద్దంకి వైసీపీలో చేర్చారని, వచ్చే ఎన్నికల్లో టికెట్ పెట్టాలనేది ఆయన లక్ష్యమని చెబుతున్నారు. 

Karanam Balaram damaging YSRCP
Karanam Balaram damaging YSRCP

ఇక చీరాలలో చూస్తే నిత్యం గొడవలే.  మొదటి నుండి అక్కడ వైసీపీని చూసుకుంటున్న ఆమంచి కృష్ణమోహన్ కరణం డామినేషన్ భరించలేకున్నా ఉన్నారు.  ఏ కార్యక్రమం జరిగినా ఇరు వర్గాల మధ్యన గొడవ కామన్ అయిపోయింది.  కరణం వర్గం నేరుగా ఆమంచికి హెచ్చరికలు ఇచ్చేస్తున్నారు.  ఈక్రమంలో కరణం టీడీపీ నేతలను ఒక్క మాటంటే ఒక్క మాట కూడ అనట్లేదు.  టీడీపీ నుండి వైసీపీకి మళ్ళిన ఎమ్మెల్యేలు ముగ్గురూ చంద్రబాబును ఏకిపారేస్తుంటే కరణం మాత్రం పల్లెత్తి మాట అనట్లేదు.  దీంతో చీరాలలో టీడీపీ ప్రశాంతంగా ఉంటోంది.  ఆమంచి టీడీపీని టార్గెట్ చేయాలని చూసినా కూడ కరణంను నిలువరించడానికే ఆయన సమయం మొత్తం సరిపోతోంది.  అంతేకాదు టీడీపీలో కరణం పార్టీని వీడారనే బాధ కూడా లేదు.  వైసీపీలో రాజుకుంటున్న చిచ్చులో చలి కాచుకుంటున్నారు వారు.  

ఇక కరణంతో నిత్యం టచ్లో ఉంటున్న టీడీపీ లీడర్ల సంగతైతే చెప్పనక్కర్లేదు.  ఏ పని కావాలన్నా పాత కరణం వద్దకు వచ్చినట్టే వచ్చి పోతూ కార్యాలు జరుపుకుంటున్నారు.  సరే వైసీపీ మనుషులకు కరణం ఏమైనా మంచి చేస్తున్నారా అంటే అదే లేదు.  వైసీపీ లోకల్ లీడర్లకు జరుగుతున్న ఫెవర్ చాలా తక్కువగా ఉంది.  మొత్తం మీద కరణం బలరాం సొంత ప్రయోజనాల కోసమో, చంద్రబాబుకు మంచి చేయడం కోసమో జగన్‌కి జైకొట్టి వైసీపీని డ్యామేజ్ చేస్తున్నారనే అనుమానం మొదలైంది కార్యకర్తల్లో.