కాపు రగడ.! వైసీపీ కొంప ముంచేసిన కొడాలి నాని.!

వాడాలనుకున్న మాట స్క్రాప్.. కానీ, అక్కడ వాడింది ‘స్కాపు’. క్లియర్‌గానే ‘స్కాపు’ అనే మాట వినిపిస్తోంది. కానీ, అది ‘కాపు’గా ప్రచారం జరుగుతోంది. కొడాలి నాని అంటేనే, బూతులకు కేరాఫ్ అడ్రస్. నోరు తెరిస్తే ఛండాలం.!

తెలుగునాట రాజకీయాల్లో కొడాలి నాని అంతటి దారుణమైన భాషని ఇంకెవరూ మాట్లాడలేరేమో.! మంత్రిగా పనిచేసినప్పుడూ అదే తంతు, మంత్రి పదవి పోయాక కూడా అదే పరిస్థితి. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు అస్సలు వుండకూడదని జనం ఛీత్కరించుకునేలా కొడాలి నాని వ్యవహరిస్తుంటారు.

ఇలాంటోళ్ళని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు ప్రోత్సహిస్తున్నట్లు.? నిజానికి, దాదాపు అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఇలాంటి నాయకులున్నారు. వారిని ఆయా పార్టీల అధినేతలు ప్రోత్సహించడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది.

‘స్కాపు నా కొడకల్లారా..’ అంటూ తాజాగా ఓ ప్రెస్ మీట్ సందర్భంగా కొడాలి నాని విరుచుకుపడిపోయారు. టీడీపీలో చంద్రబాబు భజన చేసే నాయకుల్ని ఉద్దేశించి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలవి. ఆ వ్యాఖ్యలు కాస్తా, ‘కాపు నా కొడకల్లారా..’ అంటూ కొడాలి నాని వ్యాఖ్యానించినట్లుగా ట్విస్ట్ చేయబడింది.

ఇప్పుడంతా కట్ అండ్ పేస్ట్ వీడియోల వ్యవహారం నడుస్తోంది కదా.! ఇది కూడా వైసీపీ నేర్పిన విద్యే.. అన్నట్టుగా ప్రచారమూ వుంది. కాపు సామాజిక వర్గం ఈ విషయమై చాలా గుర్రుగా వుంది. కొడాలి నానిని వెంటనే పార్టీ నుంచి పంపెయ్యకపోతే, కాపు సామాజిక వర్గం పూర్తిగా వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తుందంటూ ఆ సామాజిక వర్గ ప్రముఖులు అల్టిమేటం జారీ చేస్తున్నారు.