కాపు సామాజిక వర్గంలో అంతర్మధనం: జనసేనకి ‘కాపు’ కాసేదెలా.?

కమ్మ సామాజిక వర్గం మొత్తంగా తెలుగుదేశం పార్టీతో వుందని అనుకోలేం.! అలాగే, రెడ్డి సామాజిక వర్గం పూర్తిగా వైసీపీతో వుంటుందా.? అలాగే కాపు సామాజిక వర్గం కూడా జనసేన విషయంలో భిన్నంగానే వ్యవహరించొచ్చు.!

టీడీపీ మీద కమ్మ పార్టీ ముద్ర.. వైసీపీ మీద రెడ్డి పార్టీ ఇమేజ్.. అలాగే జనసేన మీద కాపు పార్టీ అనే స్టాంప్.. పడిపోయాయ్.! ఆ స్టాంపుల్ని చెరిపేయడం కష్టం. ఆయా పార్టీలకు ఆయా సామాజిక వర్గాల్లోని మెజార్టీ ఓటు బ్యాంకు వెళుతుంది. ఇది 2024 ఎన్నికల నాటి ఈక్వేషన్.!

అయితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ విషయంలో చేస్తున్న ప్రకటనలతో కాపు సామాజిక వర్గం ఒకింత కంగారు పడుతోంది. ‘కాపు ముఖ్యమంత్రి’ అన్న కోణంలో కాపు సామాజిక వర్గ పెద్దలు కొందరు జనసేనకు మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. వారి నమ్మకాన్ని పొందే విషయంలో జనసేనాని పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ.. గందరగోళానికి కారణమవుతున్నారు.

నిన్నటి జనసేనాని ప్రకటన.. తాజాగా జనసేనాని చేసిన ప్రకటన.. వీటిని బేరీజు వేసుకుంటున్న కాపు సామాజిక వర్గ ప్రముఖులు, జనసేనాని నుంచి పూర్తిస్థాయి స్పష్టతను కోరుతున్నారట.

ఈ మేరకు ఓ బృందం జనసేనానిని త్వరలో కలవబోతోందని తెలుస్తోంది.