కమ్మరావతి కాదట.! ఇకపై అమరావతి అట.!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాపురం విశాఖకు వెళ్ళిపోనుంది. ఈ క్రమంలోనే అమరావతిపై వున్న కమ్మరావతి ముద్రనీ వైసీపీ తన స్వహస్తాలతో చెరిపేసేందుకు ప్రయత్నిస్తోంది. మంచి ప్రయత్నమే ఇది.!

అరావతిలో పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వడం ద్వారా అమరావతిపై వున్న కమ్మరావతి ముద్రను చెరిపేయగలిగామని వైసీపీ నేతలే చెబుతున్నారు. అసలంటూ కమ్మరావతి అన్న ముద్ర వేసిందే వైసీపీ కదా.? అంతే కాదు, స్మశానమనీ వైసీపీ నేతలే అన్నారు. మంత్రులు కూడా ఇవే ఆరోపణలు చేశారు. ఎడారి అని కూడా అన్నారు. ముంపు ప్రాంతమనీ, భూకంపాలు వచ్చే అవకాశం వుందని కూడా చెప్పారు.

కానీ, ఇప్పుడు అమరావతి పేదలకూ చోటున్న నగరమని వైసీపీ చెబుతోంది. అంటే, పేదలు భూకంపానికి బలైపోయిన ఫర్వాలేదా.? ముంపు ప్రాంతంలో పేదల్ని ముంచేయాలనుకుంటున్నారా.? ఎడారిలో పేదల్ని మాడ్చెయ్యాలనుకుంటున్నారా.? స్మశానంలో పేదలకు కాపురం అంటున్నారా.? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

రాజకీయాలన్నాక సవాలక్ష విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు వుంటాయి. అమరావతి మీద వైసీపీ చేసిన ఆరోపణలు కూడా అంతే. అంతా వైసీపీ కళ్ళతోనే చూడాలేమో.!

అమరావతికి ‘కమ్మ’ మకిలి వదిలిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా వైసీపీ అంగీకరించెయ్యొచ్చు కదా.? అలా అంగీకరించేస్తే విశాఖకు మకాం మార్చే భారం కూడా ముఖ్యమంత్రికి తగ్గుతుందేమో.!