ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కుల ప్రాతిపదికనే నడుస్తున్నాయనేది పచ్చి వాస్తవం. ఒక్కొక పార్టీ ఒక్కో సామజికవర్గం అండతో ముందుకు సాగుతోంది. తెలుగుదేశం కమ్మ సామాజికవర్గం వెన్నుదన్నుతో నిలబడుతూ వస్తుంటే వైకాపాకు రెడ్డి సామాజికవర్గం సంపూర్ణ మద్దతునిచ్చింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలు, దళితులు అంటూ పలు వర్గాలను కూడగట్టుకోగా ప్రస్తుత పార్టీలు మాత్రం ఒక వర్గం మీదనే డిపెండ్ అయి మిగతా వాటిని సెకండరీ సపోర్టర్లుగా భావిస్తున్నాయి. అయితే ఈ పరిణామానికి నంది పలికింది తెలుగుదేశం పార్టీయే అనాలి. ఎన్టీఆర్ పార్టీ పెడుతూనే ఇది బీసీల పార్టీ అన్నారు. బీసీ వర్గాలకు అవసరమైన అంశాలతోనే మేనిఫెస్టో తయారుచేసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాక వాటిని చక్కగా అమలుచేశారు.
ఎన్టీఆర్ ఉన్నంత కాలం బీసీలు పక్కచూపులు చూడలేదు. పూర్తిగా పచ్చజెండానే భుజానికెత్తుకున్నారు. 2014 ముందు వరకు ఇదే పరిస్థితి నడిచింది. గతంలో పలుమార్లు ఈ స్ట్రాటజీనే వర్కవుట్ అయి అధికారాన్ని కట్టబెట్టింది. కానీ రాజశేఖర్ రెడ్డి హయాంలో మాత్రం పూర్తిస్థాయిలో పని చేయలేదు. బీసీలు గంపగుత్తగా ఓట్లు గుద్దినా అవతల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ మైనార్టీలతో పాటు రెడ్డి వర్గాన్ని తమవైపుకు తిప్పుకోవడంతో గెలుస్తూ వచ్చింది. అంటే అక్కడ రెడ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలకంగా వ్యవహరించారు. దీన్ని గమనించిన చంద్రబాబు బీసీలతో పాటు ఇంకొక వర్గం కూడ అండగా ఉన్నప్పుడే అధికారం దక్కించుకోగలమని భావించి 2014 ఎన్నికల సమయంలో కమ్ములను చేరదీశారు.
ఎన్నాళ్ళ నుండో రాజకీయ బలం కోసం వేచి చూస్తున్న కమ్మవర్గం చంద్రబాబు ఆదరించడంతో పూర్తిగా టీడీపీకి మద్దతిచ్చారు. ఫలితంగా 2014లో బాబుగారు ముఖ్యమంత్రి అయ్యారు. అంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు చిక్కు మొదలైంది. కొత్తగా చేరిన కమ్ములను భుజానికెత్తుకున్న బాబుగారు ఇతర బీసీ వర్గాలను చంక దించేశారు. అన్నింటిలోనూ కమ్ముల డామినేషన్ పెరిగిపోయింది. ఒకప్పుడు బీసీల పార్టీ అని పేరు తెచ్చుకున్న పార్టీ చివరకు కమ్మ వర్గం క్యాంప్ అయిపోయింది. అదే అదునుగా భావించిన జగన్ బీసీలను దువ్వారు. ఇంకేముంది 2019 ఎన్నికల్లో టీడీపీ యొక్క బీసీ ఓట్లు బ్యాంక్ చెల్లాచెదురైంది. ఓట్లు టీడీపీ, వైసీపీల మధ్యన చీలిపోయాయి. ఎస్సీ ఎస్టీ, మైనారిటీలు, రెడ్డి, బీసీ వర్గాల మడ్డతో జగన్ 151 సీట్ల అఖండ మెజారిటీని దక్కించుకోగా బీసీలను కోల్పోయి 23 స్థానాలకు పరిమితమైంది టీడీపీ.
ఆ ఘోర పరాజయంతో ఈసారి ఎన్నికల్లో గెలవాలంటే బీసీల సపోర్ట్ తప్పనిసరి అని చంద్రబాబుకు అర్థమైంది. వారి మద్దతు పూర్తిగా తమకే ఉండాలని భావించి వారిని బుజ్జగించే పనులు మొదలుపెట్టారు. పార్టీ అధ్యక్ష పదవిని బీసీ నేత అచ్చెన్నాయుడుకు, తెలుగుయువత అధ్యక్ష పదవిని బీసీ వర్గానికే చెందిన గంగుపల్లి శ్రీరాంకు కట్టబెట్టారు. దీని ఫలితం రేపటి ఎన్నికల్లో బీసీల మీద కనిపిస్తుందో లేదో చెప్పలేం కానీ ప్రజెంట్ కమ్మ వర్గం మీద గట్టిగా ఎఫెక్ట్ చూపుతోంది. పార్టీ తన చేతుల్లోంచి మళ్ళీ బీసీలను వెళ్లిపోతుందేమోనని కంగారుపడుతున్నారు. అదే జరిగితే ఇకపై ఎప్పటికీ పార్టీలో ప్రథమ స్థానంలో ఉండలేమని చింతపోతున్నారు.