ఆ ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ విసిరిన కడియం

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హరితహారంలో భాగంగా వరంగల్ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజిలో తన కూతురు కావ్వతో కలిసి మొక్కలు నాటారు. ఎమ్మెల్యేలు కొండా సురేఖ, దాస్యం వినయ్ భాస్కర్, అరూరి రమేష్ లకు ఆయన గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. తలా మూడు మొక్కలు నాటాలని కడియం వారికి ఛాలెంజ్ విసిరారు. తన ఛాలెంజ్ ను స్వీకరించి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మొక్కలను నాటి వరంగల్ వాసులందరికీ గ్రీన్ ఛాలెంజ్ ద్వారా స్పూర్తినివ్వాలన్నారు.  మొక్కలు నాటిన ఆనందాన్ని సెల్ఫీతో ఆయన షేర్ చేసుకుంటున్నారు. చెట్లే జీవనాధారానికి మూలమని అవి పచ్చగా ఉంటే మన జీవితాలు పచ్చగా ఉంటాయని కడియం అన్నారు.