నన్ను క్షమించండి నాన్న, మీ రుణం వచ్చే జన్మలో తీర్చుకుంటా…ఇవి జూనియర్ ఎన్టీఆర్ ఆవేదనతో చెప్పిన మాటలు. జూనియర్ ఎందుకు ఇలా అన్నాడు? అసలు జూనియర్ ఎప్పుడు ఇలా అన్నాడో, ఏ సందర్భంలో అన్నాడో పూర్తి వివరాలు కింద ఉన్నాయి చదవండి.
జై లవ కుశ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల వాత్సల్యానికి ఎమోషనల్ అయిపోయాడు. అభిమానుల్ని ఉద్దేశించి ఇలా మాట్లాడాడు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఈ జన్మలో మీ అభిమానం, ఆప్యాయత, వాత్సల్యం దక్కింది. నేను మీ అందరి ముఖంగా మా అమ్మానాన్నలకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. నాకు జన్మనిచ్చారు తల్లిదండ్రులు, ఆ రుణం ఎప్పటికి తీర్చుకోలేను. “నాన్నా…ఇంకో జన్మ ఉంటే మీ రుణం తీర్చుకుంటాను, ఈ జన్మకు మాత్రం వీళ్ళతో ఉండిపోతాను” అని హరికృష్ణవైపు తిరిగి చెప్పాడు తారక్.
అయితే జూనియర్ చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. హరికృష్ణ…తారక్ రాజకీయాల్లోకి రావాలని ఆశించారు. అయితే ఎన్టీఆర్ ఈ జన్మకి అభిమానులతోనే ఉండిపోతా అని చెప్పటం వెనుక రాజాకీయ అరంగేట్రంపై క్లారిటీ ఇచ్చాడని అనుకున్నారంతా. హరికృష్ణ కోరిక మేరకు రాజకీయాల్లోకి రాలేనని ఇండైరెక్ట్ గా తండ్రికి చెప్పాడని అభిమానులు భావించారు.
హరికృష్ణ జూనియర్ ని టీడీపీలో ప్రముఖ పదవిలో చూడాలి అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ కి ఉన్న ఫాలోయింగ్ వలన లోకేష్ డామినేట్ అయ్యే అవకాశం ఉండటంతో జూనియర్ ని చంద్రబాబు పక్కన పెట్టారు. ఆ విబేధాల కారణంగానే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి, బాలకృష్ణకి…హరికృష్ణ ఫ్యామిలీ దూరంగా ఉంటున్నారని రాజకీయ వర్గాల్లో వినిపించే గుసగుసలు.