ఎన్టీఆర్ సపోర్ట్ పై పవన్ వర్గం నుంచి బయటకి వచ్చిన సంచలన క్లారిటీ.!

రీసెంట్ గా టాలీవుడ్ లో ఎలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి కనిపిస్తూనే ఉన్నాయి. కేంద్ర స్థాయిలో రాజకీయ నాయకులు పలువురు హీరోలను కలుస్తుండడం సినీ వర్గాల్లో సహా రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాల్లో కూడా ఆసక్తిగా మారగా ప్రముఖ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం పరిస్థితి మరింత రంజుగా మారింది.

దీనితో ఒకింత ఒకో రోజు ఒకో రకమైన వార్త అయితే వినిపిస్తుంది. అయితే తారక్ బీజేపీ పార్టీకి ఏపీ మరియు తెలంగాణాలో ప్రచారం చేస్తాడని సంచలన టాక్ బయటకి రాగ దీనిపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ కీలక నేత బొలిశెట్టి చేసిన లేటెస్ట్ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

పవన్ పార్టీ కి మద్దతుగా రామ్ చరణ్ ప్రచారం చేస్తాడని అలాగే ఎన్టీఆర్ బీజేపీ తరుపున మాకు సపోర్ట్ చేస్తాడని సంచలన కామెంట్స్ చేశారు. దీనితో అయితే పరోక్షముగా పవన్ కి జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేసినట్టే అని చెప్పాలి.

ఆల్రెడీ ఈ రెండు పార్టీ లు కూడా ఇప్పుడు పొత్తులో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ లేటెస్ట్ గా తాను చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు సినీ మరియు రాజకీయ వర్గాల్లో అభిమానుల్లో ఆయా పార్టీల కార్యకర్తల్లో పెను దుమారం రేగింది. మరి నిజంగానే ఎన్టీఆర్ వస్తాడో లేదో అనేది చూడాలి.