జర్నలిస్టుల ఇళ్ళ నిర్మాణం కోసం విజయవాడలో రిలే నిరాహార దీక్షలు

జర్నలిస్ట్ ల ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరమ్ (ఏపీజేఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. విజయవాడ ధర్నాచౌక్ లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఏపీజీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బ్రహ్మయ్య ప్రారంభించారు. ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లు చెవుల కృష్ణఅంజనేయులు, మారేళ్ల వంశీకృష్ణలు తో పాటు పెద్ద సంఖ్యలో పాత్రికేయులు  నిరాహార దీక్షలో పాల్గొన్నారు.ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెవుల కృష్ణఅంజనేయులు మాట్లాడుతూ అర్హులైన లపాత్రికేయులందరికి ఇల్లు నిర్మాణమే లక్ష్యంగా పోరాడుతున్నట్టు చెప్పారు. జర్నలిస్ట్ ల ఇళ్ల నిర్మాణానికి వెంటనే శంకుస్థాపన చేయాలని ఆయన

జర్నలిస్ట్ ల ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరమ్ (ఏపీజీఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. విజయవాడ ధర్నాచౌక్ లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఏపీజీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బ్రహ్మయ్య ప్రారంభించారు. ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లు చెవుల కృష్ణఅంజనేయులు, మారేళ్ల వంశీకృష్ణలు తో పాటు పెద్ద సంఖ్యలో పాత్రికేయులు  నిరాహార దీక్షలో పాల్గొన్నారు. వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు.

ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెవుల కృష్ణఅంజనేయులు మాట్లాడుతూ అర్హులైన లపాత్రికేయులందరికి ఇల్లు నిర్మాణమే లక్ష్యంగా పోరాడుతున్నట్టు చెప్పారు. జర్నలిస్ట్ ల ఇళ్ల నిర్మాణానికి వెంటనే శంకుస్థాపన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారందరికి ఇల్లు మంజూరుపత్రాలు ఇవ్వాలని, సీనియర్ పాత్రికేయులు అక్రిడేషన్ లేకపోయినా ఇల్లు కేటాయించాలని, రేషన్ కార్డు లేదనే కారణంతో దరఖాస్తులు తిరస్కరించరాదని ఆయన డిమాండ్ చేశారు. ఏపీజేఎఫ్ విజ్ఞప్తికి రాష్ట్రప్రభుత్వం మొదటి నుంచి సానుకూలంగానే స్పందించిందని ఆయన తెలిపారు. కానీ ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతుందన్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా దీనిని విస్తరిస్తామని ఆయన హెచ్చరించారు.

ఏపీజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారేళ్ల వంశీకృష్ణ మాట్లాడుతూ జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం ఈ ఉద్యమం చేపట్టినట్టు చెప్పారు. జర్నలిస్ట్ ల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి అనే అంశాలపై ఏపీజేఎఫ్ పోరాదుతుందని స్పష్టం చేశారు. జర్నలిస్ట్ ల ఇళ్ల నిర్మాణానికి సంబందించి ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలుకు నోచుకోకపోవటం శోచనీయమని చెప్పారు.ప్రభుత్వం ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి స్పష్టమైన ప్రకటన చేసి శంఖుస్థాపన చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం జావుయం చేస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేసే విధంగా కార్యాచరణ రూపొందించగలమని ఆయన హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు సైతం ఏపీజేఎఫ్ సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు.

ఏపీ ఎన్జీవో అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పరుచూరిఅశోక్ బాబు మాట్లాడుతూ సమాజానికి ప్రభుత్వానికి పాత్రికేయులు వారధిలాంటి వారని చెప్పారు. ప్రభుత్వం హామీని అమలు చేయడంలో జాప్యం చేయటం తగదని ఆయన సూచన చేశారు. తక్షణమే ఇళ్ల నిర్మాణానికి ఇచ్చిన హామీ నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.కార్యక్రమానికి వై ఎస్ ఆర్ సీ పి విజయవాడ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్ ఎల్ ఏ మలాది విష్ణు మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కోసం పాత్రికేయులు నిరాహార దీక్ష చేయటం శోచనీయమన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వుండే పాత్రికేయులకే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్ధం కావటం లేదని చెప్పారు. అన్ని వర్గాలకు ప్రభుత్వం పెద్ద గుండుసున్నా ఇచ్చిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. పాత్రికేయులతో పాటు కలసి ఉద్యమం చేసేందుకు తమ పార్టీ సిద్ధంగా వున్నదని తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పాటైతే మొదటి సంవత్సరంలోనే పాత్రికేయుల సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబూరావు పాత్రికేయుల నిరాహార దీక్షకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ పాత్రికేయుల ఆందోళనకు తమ పార్టీ పూర్తిమద్దతు ప్రకటిస్తున్నట్టు చెప్పారు. హోసింగ్ ఫర్ అల్ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని  పరిగణలోకి తీసుకోవాలన్నారు. పాత్రికేయుల సమస్యలు న్యాయ సమ్మతవైనవని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం కాలయాపన చేయటం తగదన్నారు.ఇళ్ల నిర్మాణం అనేది కనీస ఆ అవసరంగా పరిగణించాలని ఆయన సూచించారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు గుర్నాధం మాట్లాడుతూ ప్రభుత్వం పాత్రికేయులు కు ఇచ్చ్8న హామీ ని అమలుపరచక పోవటం దారుణమన్నారు. మనిషి హుందాగా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని ఆయన చెప్పారు. ప్రభుత్వం తలచుకుంటే పాత్రికేయుల కు ఇళ్లను ఇవ్వటం అసాధ్యమేమీ కాదన్నారు. పాత్రికేయుల న్యాయబద్ధమైన డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. పీసీసీ అధ్యక్షునితో సైతం మాట్లాడి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. యువజన కాంగ్రెస్ నాయకుడు సతీష్ మాట్లాడుతూ పాత్రికేయుల న్యాయబద్ధమైన కోర్కెలకు యువజన కాంగ్రెస్ సంపూర్ణ  మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు.

జనసేన పార్టీ నాయకులు పోతుల మహేష్ మాట్లాడుతూ సమాజాన్ని చైతన్య పరుస్తూ చాలీచాలని జీతాలతో బ్రతుకున్న పాత్రికేయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పాత్రికేయుల ఉద్యమానికి పూర్తి సంఘీభావం ప్రకటించారు. పాత్రికేయుల సానుకూల దృక్పధం తోనే ప్రభుత్వ పునాదులు ఆధారపడివుంటుందని ఆయన పేర్కొన్నారు. పాత్రికేయుల సమస్యలను తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళతానని ఆయన హామీ ఇచ్చారు.

వై ఎస్ ఆర్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి కొణిజేటి రమేష్ మాట్లాడుతూ పాత్రికేయుల దీక్షకు సంఘీభావం ప్రకటించారు. వై ఎస్ ఆర్ సీ పార్టీ ట్రేడ్ యూనియన్ విజయవాడ జిల్లా అధ్యక్షుడు నంబూరి ప్రదీప్, అఖిలభారత ఎల్ ఐ సీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు తట్టుకోళ్ళ నాగేశ్వరరావు లు తమ ప్రసంగాల లో ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఏపీజీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కృపవరం మాట్లాడుతూ జర్నలిస్ట్ లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని విస్తరిస్తామని ఆయన చెప్పారు.

ఏపీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బ్రహ్మయ్య మాట్లాడుతూ జర్నలిస్ట్ ల డిమాండ్లు కొత్తవి కావన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ లను అమలు చేయమని మాత్రమే కోరుతున్నట్టు చెప్పారు. జర్నలిస్ట్ ల ఇళ్ల నిర్మాణం లో జాప్యం వల్ల ప్రభుత్వం పై విశ్వాసం కోల్పోవాల్సి వస్తుందని ఏపీజేఎఫ్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు వీర్ల శ్రీరామ్ యాదవ్ అన్నారు. ఇళ్ల నిర్మాణం ప్రారంభం అయ్యేవరకు ఉద్యమం కొనసాగుతుందని ఏపీజేఎఫ్  నాయకులు వినోదకుమార్ స్పష్టం చేశారు.

సీనియర్ పాత్రికేయుడు నగేష్ బూర్తి మాట్లాడుతూ పాత్రికేయుల ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం లో స్పష్టత లేదని చెప్పారు. ఏపీజేఎఫ్ జిల్లా కార్యదర్శి పొత్తూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ పాత్రికేయుల సమస్యలపై పోరాటంలో ఏపీజేఎఫ్ ముందువరుసలో ఉందన్నారు. ఎన్నికల కోడ్ వచ్చే లోగా ప్రభుత్వ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఫైట్ ఫర్ హౌస్ నాయకుడు పులిగడ్డ సత్యనారాయణ, నాగేశ్వరరావు, శాఖమూరు శ్రీనివాస ప్రసాద్, చెవుల రంగారావు, వి శ్రీనివాసరావు, వీర్ల శ్రీరామ్ యాదవ్, యేమినేని వెంకటరమణ, సత్యనారాయణ, కూర్మ ప్రసాద బాబు, కోటేశ్వర రావు, హలీం, సాయికుమార్, గణపతి  తదితరులు ప్రసంగించారు. గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు గుంటూరు, విజయవాడ నగరానికి చెందిన పాత్రికేయులు ఈ రిలే నిరాహార దీక్షలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.