Jogi Ramesh: వైకాపా 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిపాలు కావడంతో ఎంతోమంది కీలక నేతలు పార్టీని వీడి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. కొంతమంది రాజకీయాలకు దూరంగా ఉండగా మరి కొందరు మాత్రం తెలుగుదేశం పార్టీ జనసేనలోకి వెళ్తున్నారు. ఇలా ఎంతో మంది కీలక నేతలు ఇప్పటికే వైకాపా పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.ఇక త్వరలోనే మాజీ మంత్రి జోగి రమేష్ సైతం వైకాపాను వీడబోతున్నారు అంటూ రెండు రోజుల నుంచి వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఇలా ఈ వార్తలు రావడానికి కారణం లేకపోలేదు ఇటీవల నూజివీడు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో టిడిపి ఎమ్మెల్యే గౌతు శిరీష అలాగే మంత్రి పార్థసారథి పాల్గొన్నారు. ఐతే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైకాపా మాజీ మంత్రి జోగి రమేష్ కూడా పాల్గొనడంతో ఈ విషయం కాస్త పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది.
జోగి రమేష్ సైతం త్వరలోనే పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని అందుకు సంకేతంగానే గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో టిడిపి నేతలతో కలిసి పాల్గొన్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై జోగి రమేష్ పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. మొదటగా ఈ విగ్రహ విష్కరణ కార్యక్రమం పార్టీలకు అతీతంగా గౌడ సంఘీభావాల మాత్రమే పాల్గొని నిర్వహించినది దీంతో ఈ కార్యక్రమంలో టిడిపి మంత్రులతో పాటు వైకాపా మాజీ మంత్రి కూడా పాల్గొన్నారు.
ఇకపోతే ఇటీవల పేర్ని నానిని ఇబ్బంది పెట్టడం కోసం ఆయన పై తప్పుడు కేసులు పెడుతూ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే కొంతమంది వైకాపా నేతలు పేర్ని నాని ఇంటికి వెళ్లి ఆయనని పరామర్శిస్తూ వచ్చారు. అలా వెళ్లిన వారిలో జోగి రమేష్ కూడా ఒకరు. ఇలా జోగి రమేష్ కూడా పేర్ని నాని ఇంటికి వెళ్లడంతో ఈయన పార్టీ మారే ఆలోచనలో లేరని స్పష్టమవుతుంది అయితే గౌడ కులస్తుల సమక్షంలో జరిగిన విగ్రహావిష్కరణ కార్యక్రమం పార్టీలకు అతీతంగా జరగడంతో ఆయన హాజరైనట్టు తెలుస్తోంది.