ఏపీలో వాలంటీర్లు వర్సెస్ జనసేన రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏలూరు సభలో వాలంటీర్లపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా… రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పవన్ దిష్టిబొమ్మలు దహనం చేయడం, ఫోటోలను చెప్పులతో కొట్టడం చేస్తున్నారు. ఈ నేపథ్య్ ఏపీ మంత్రి కీలకవాఖ్యలు చేశారు.
జనసేన వారాహి యాత్ర రెండో దశలో భాగంగా పవన్ చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెనుదుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏలూరులో నిర్వహించిన సభలో వాలంటీర్లు ఉమన్ ట్రాఫికింగ్ కి సహకరిస్తున్నారంటూ పవన్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే!
ఇదే సమయంలో వైసీపీ నేతలు మంత్రులు పవన్ పై ఫైరవుతున్నారు. కొంతమంది మంత్రులైతే పవన్ ని ఏకవచనంతో సంభోదిస్తూ వాయించి వదిలిపెడుతున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో రాబోయే ఎన్నికల్లో పవన్ పై ఒక వాలంటీర్ ని పోటీకి నిలబెడతామని ఆ సత్తా తమకు ఉందని ఏపీ మంత్రి జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు! ఇదే సమయంలో పవన్ ని చిత్తు చిత్తుగా ఓడిస్తామని అన్నారు.
వాలంటీర్ సచివాలయ వ్యవస్థలు విజయవంతం అవ్వడం వల్లే పవన్ కల్యాణ్ వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెబుతున్న జోగి రమేష్… వాలంటీర్ల వ్యవస్థ దేశానికే ఆదర్శం అని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా… పవన్ ను “కళ్యాణి అక్క” అని సంబోధిస్తూ ఎద్దేవా చేసిన మంత్రి జోగిరమేష్… ఆ కల్యాణి అక్క దిష్టిబొమ్మలను చెప్పులతో కొడుతున్నారని, రోడ్లపై ఊరేగించి దహనం చేస్తున్నారని అన్నారు!
ఈ సందర్భంగా.. జగన్ ను ఎవరెస్ట్ తో పోల్చిన మంత్రి… పవన్ కు ధమ్ముంటే, ధైర్యముంటే, చీమూ నెత్తురూ వంటివి ఉంటే ఉంటే ఒంటరిగా పోటీ చేయాలని… అలా ఒంటరిగా పోటీ చేస్తే పవన్ పై ఒక వాలంటీర్ ని పోటీకి నిలబెడతామని.. పవన్ ని చిత్తు చిత్తుగా ఓడిస్తామని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
మరి ఈ ఛాలెజ్ ని అయినా పవన్ స్వీకరిస్తారా.. లేక తానేమీ వినలే తానేమీ కనలేదు అన్నట్లుగా మిన్నకుంటారా అన్నది వేచి చూడాలి!