సినిమాల్లో వేగం.! రాజకీయమంటేనే అలసత్వం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా వున్నారు.! మరి, రాజకీయాల సంగతేంటి.? అది ఆ పార్టీ నేతలకే అర్థం కాని ప్రశ్న.! జనసైనికులు మాత్రం గట్టిగానే వున్నారు. జనసేనలో కొందరు నేతలూ యాక్టివ్‌గానే వుంటున్నారు. ప్చ్.. అధినేత వైఎస్ జగన్ మాత్రం రాజకీయాల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నారు.

సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ని దాదాపుగా పూర్తి చేసేసుకున్నారు పవన్ కళ్యాణ్. జస్ట్ 25 రోజుల డేట్స్ ఇచ్చారు జనసేనాని ఈ సినిమాకి. మొత్తంగా టాకీ పార్ట్ వరకూ పవన్ పూర్తి చేసేసుకోవడం గమనార్హం. ఇంత వేగంగానా.? ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా పవన్ కళ్యాణ్ రికార్డులకెక్కారు. కేవలం 25 రోజులకే యాభై కోట్లు.. ఇది ఆయన చెప్పిన విషయమే మరి.! చెయ్యాల్సినవి, పూర్తి చేయాల్సినవీ.. బోల్డన్ని సినిమాలున్నాయ్. వాటన్నిటికీ ఇలాగే డేట్లు కేటాయించేస్తే.? ఓ దానికి కుదిరింది, అన్నటికీ అలాగే కుదరడం కష్టం.

సినిమాలు సరే, రాజకీయాల మాటేమిటి.? తెలంగాణలో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు డజన్లకు పైగా సీట్లలో పోటీ చేయనున్నట్లు జనసేనాని స్వయంగా ప్రకటించారు. మరి, ఏదీ తెలంగాణలో హంగామా.? తెలంగాణ సంగతి పక్కన పెడితే, ఏపీలో అధికారంలోకి వచ్చేస్తామంటున్నారు జనసేనాని.?

కానీ, ఎలా.? ఇంత నిర్లక్ష్యపూరిత రాజకీయంతో ఆంధ్రప్రదేశ్‌లో అధికార పీఠమెక్కడం జనసేనానికి సాధ్యమేనా.?