ఏబీఎన్ రాధాక‌ృష్ణను బూతులు తిట్టిన టిడిపి ఎంపి(వీడియో)

సంచలనాలకు కేరాఫ్ అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి. ఇప్పుడో మీడియా ప్రతినిధిపై చిర్రుబుర్రులాడాడు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పై తిట్ల దండకమెత్తాడు. పార్లమెంటులో జరిగే ఓటింగ్ కార్యక్రమంలో తాను పాల్గొననని జెసి దివాకర్ రెడ్డి అలకపానుపు ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత జెసి దివాకర్ రెడ్డి అనంతపురంలో ప్రెస్ మీట్ లో మాట్లాడారు. తాను ఢిల్లికి వెళతానని ఓటింగ్ లో పాల్గొంటానని చెప్పారు. అప్పుడు ఏబీఎన్ రిపోర్టర్ మీరు బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డారని మీరు అనుకున్నది నెరవేరిన తర్వాతనే ఢిల్లి కి వెళుతున్నారాని ప్రచారమైతున్నది నిజమేనా అన్ని ప్రశ్నించాడు. అంతే జెసి దివాకర్ రెడ్డి ఒక్క ఉదుటన లేచాడు “ఏం మాట్లాడుతున్నావ్ నీవు… బుద్ది ఉండి మాట్లాడాలా… ఏ ఏ ఛానల్ నీది అని ప్రశ్నించాడు. అప్పుడు రిపోర్టర్ ఏబీఎన్ అని సమాధానం ఇవ్వగా ఏ ఛీ పనికిమాలిన నా కొడుకు.. తియ్యి .. బయటకు వెళ్లు నువ్వు ఫస్టు.. గెట్ అవుట్ ఐ సే గెట్ అవుట్ ఫస్టు” అంటూ జెసి విరుచుకుపడ్డారు. దీంతో రిపోర్టర్ అవమాన భారంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీన్ని ఖండించాల్సిన సాటి జర్నలిస్టు మిత్రులు అక్కడే ఉన్నా నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ తర్వాత జిల్లా జర్నలిస్టు సంఘం జెసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన అది జరగలేదు. దీనిపై రాష్ట్ర జర్నలిస్టు సంఘాలు కూడా స్పందించనట్టుగా తెలుస్తోంది.