నేటి రాజకీయాలలో ప్రత్యర్ధులను విమర్శించడం తప్ప..ప్రశంసించింది ఏనాడు. అధికారం-ప్రతిపక్షం అనే మాట పక్కనబెడితే ! ఏనాడైనా అధికార పక్షం నేతలు ప్రతిపక్షం నేతల్ని చిత్త శుద్దితో ప్రశించిన సందర్భం ఎక్కడైనా ఉందా? లేక! ప్రతిపక్షం నేతలు అధికార పక్షాన్ని ప్రశంసించిన ఘట్టం ఎప్పుడైనా చోటు చేసుకుందా? అంటే సరైన సమాధానం కష్టమే. కానీ తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన గురించి..ఆయన హయంలో తీసుకొచ్చిన పథకాల గురించి అవకాశం చిక్కినప్పుడల్లా తనదైన శైలిలో ప్రశంసించడం ఆయనకే చెల్లింది.
ఇటీవలే వైఎస్సార్ తీసుకొచ్చిన ఆరోగ్య శ్రీ, 108 సర్వీస్ గురించి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఆ రెండు పథకాలు ఎంతో మేలు జరిగింది కాబట్టే తెలంగాణలో తాను ఆ పథకాల్ని యథావిధిగా కొనసాగిస్తున్నని వెల్లడించి వైఎస్సార్ ఫ్యాన్స్ ని ఫిదా చేసారు. తాజాగా కేసీఆర్ బాటలోనే మాజీ ఐఎఎస్ అధికారి జయ ప్రకాష్ నారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కుమారుడు జగన్ మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసారు. జగన్ విద్యుత్ అంశంలో చేసిన సంస్కరణ చాలా బాగుందని జేపీ తెలిపారు. కేంద్రం ఒత్తిడితో ఈ పథకాన్ని రద్దు చేసిన నగదు దిలీ చేయడం ప్రజలు హర్షిస్తున్నారని అన్నారు.
జగన్ టీమ్ రైతులు వాడుతోన్న కరెంట్ లెక్కలు సేకరించే పనని గొప్పగా చెప్పుకొచ్చారు. జేపీ ఎత్తుకున్న ఈ ప్రశంసతో ఆయనపై ఉన్న కొన్ని విమర్శలకు చెక్ పెట్టినట్లు అయింది. జయ ప్రకాష్ నారాయణ చంద్రబాబు నాయుడు విధానాల్నే సమర్ధిస్తారని చాలా కాలంగా కొన్ని విమర్శలున్నాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు తీసుకొచ్చిన కొన్ని పథకాలపై జేపీ ప్రశసంలు కురిపించేవారు . ఈ నేపథ్యంలో పలు సందర్భాల్లో వైసీపీ నేతలు సైతం జేపీపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఆ లెక్కల్ని జేపీ సరిచేసినట్లే ఉంది.