ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ కు ఆంధ్రప్రదేశ్ కు వరుసగా రెండుసార్లు మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యొక్క పాలనకు ఇదే నిదర్శనం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న దాదాపు అన్ని నిర్ణయాలు కోర్ట్ ల చుట్టూ తిరుగుతున్నా కూడా తన మొండి పట్టుదలతో జగన్ ముందుకు వెళ్తున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాలకు జగన్ కట్టుబడి ఉంటూ కోర్ట్ లలో కూడా పోరాడుతున్నారు. ఎందుకంటే తాను తీసుకున్న నిర్ణయాల పట్ల జగన్ అంత నమ్మకం ఉంది. ఇప్పుడు జగన్ యొక్క పాలన వల్ల రాష్ట్రానికి ఒక పెద్ద కంపనీ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది.
జపాన్ కి చెందిన యకొహమా గ్రూప్ వారి అలియెన్స్ టైర్స్ గ్రూప్ తన మూడవ ప్లాంట్ ని విశాఖపట్నంలో పెట్టడానికి రెడీ అవుతోంది. విశాఖ వంటి మెగాసిటీని ఎంచుకుని మరీ 1250 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేస్తోంది. ఈ పెట్టుబడుల వల్ల రాష్ట్రంలోని యువతకు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఉద్యోగాలు లభించనున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తరువాత రాష్ట్రానికి వచ్చిన అతిపెద్ద పెట్టుబడి ఇదేనని పండితులు చెప్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో విశాఖలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి పెట్టుబడి వేదికలు నిర్వహించినా కూడా ఒక్క కంపనీ కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాలేదు. ఇప్పుడు పెద్ద మొత్తంలో పెట్టబడులు పెట్టడానికి కంపనీలు ముందుకు వస్తున్నాయి. అయితే ఈ విషయాలను జగన్ తన పార్టీ నేతలకు కూడా తెలియకుండా నిర్వహిస్తున్నారు. అలాగే ప్రచారం కోసం కూడా ఈ విషయాలు చెప్పుకోవడం లేదు. ఇలా సైలెంట్ గా తన పాలనను కొనసాగిస్తూ ప్రజల మద్దతు పొందుతున్నారు.