జనసేనకు 38 సీట్లు.! ధృవీకరిస్తున్న వైసీపీ.!

2024 ఎన్నికల్లో జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.? అన్నదానిపై భిన్న వానదలున్నాయి. ఈసారి కూడా సున్నా చుట్టేయడం ఖాయమనే అభిప్రాయం టీడీపీ, వైసీపీ నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే. జనసేన మాత్రం, 80 సీట్లు.. ఆ పైన ఖచ్చితంగా గెలుచుకుంటామంటోంది.

కాగా, టీడీపీ అలాగే వైసీపీ అంతర్గత సర్వేల్లో జనసేనకు 18 నుంచి 22 శాతం వరకు ఓటు బ్యాంకు రావొచ్చని తేలుతోంది. సుమారు 18 సీట్ల వరకు జనసేన గెలుచుకునే అవకాశాలూ వున్నాయన్నది ఓ అంచనా. టీడీపీ – జనసేన కలిస్తే.. జనసేన గనుక ఓ 40 స్థానాల్లో పోటీ చేస్తే, 35 స్థానాల వరకూ గెలుచుకోవచ్చనే విశ్లేషణలూ వున్నాయి.

ఇదిలా వుంటే, టీడీపీ స్థాయిని తగ్గించేలా వైసీపీ అనుకూల మీడియాలో కొన్ని సర్వేల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఈ సర్వేల ప్రకారం చూస్తే, టీడీపీ 38 స్థానాల్లో మూడో స్థానానికి పరమితమవ్వొచ్చట. యాభై స్థానాల్లో అభ్యర్థులే లేరట.!

దీన్ని విశ్లేషిస్తున్న జనసేన, 38 స్థానాల్లో జనసేన బలంగా వుందని వైసీపీ అంటోందంటే, జనసేన గెలవబోయే స్థానాల సంఖ్య అంతకు మించి వుంటుందన్నది జనసేన విశ్లేషణ. అధికార వైసీపీనే, జనసేన బలాన్ని ఇంతలా అంచనా వేస్తోందంటే.. జనసేన అధికార పీఠమెక్కడం ఖాయమని జనసైనికులూ విశ్లేషించుకుంటున్నారు.

అయితే, వైసీపీ సర్వేల్లో జనసేన 38 స్థానాల్లో రెండో స్థానానికి పరిమితమవుతుందని మాత్రమే.! టీడీపీకి కాకుండా జనసేనకు వైసీపీ రెండో స్థానాన్ని కట్టబెట్డం కూడా వ్యూహాత్మకమే కావొచ్చు. వైనాట్ 175 అంటున్న వైసీపీ, ఈ తరహా విశ్లేషణల్ని ప్రచారంలోకి తెస్తే, వైసీపీ శ్రేణుల్లోనే గందరగోళం నెలకొనే అవకాశం లేకపోలేదు.