టీడీపీతో వెళితే నష్టపోతాం: జనసేనలో అంతర్మధనం.!

‘తెలుగుదేశం పార్టీతో కలిసి వెళితే, వచ్చే ఎన్నికల్లో పదో పాతికో సీట్లు రావొచ్చు. కూటమి అధికారంలోకి వస్తే సరే సరి. లేనిపక్షంలో, మళ్ళీ వైసీపీనే అధికారంలోకి వస్తే, ‘ఫిరాయింపుల్ని ప్రోత్సహించి’ రెండు పార్టీల్నీ ఖాళీ చేసేస్తుంది..’ అంటూ జనసేన పార్టీలో అంతర్మధనం మొదలైందట.

ఇదీ రియలైజేషన్ అంటే.! ఇంతకీ, ఇది నిజమేనా.? తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయమై జనసేన పార్టీ పునరాలోచనలో పడిందా.? అలాగే కనిపిస్తోంది పరిస్థితి చూస్తోంటే.

‘జనసేన ఒంటరిగా పోటీ చేసి నాలుగైదు సీట్లు గెలుచుకున్నా బలంగా నిలబడగలుగుతాం. ఇంకో పది పదిహేను సీట్లు ఎక్కువే వచ్చినా రావొచ్చు..’ అంటూ జనసేన పార్టీలో అంతర్గత సమావేశాల సందర్భంగా జనసైనికులు, జనసేన కీలక నేతలు తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చుతున్నారట.

ఎప్పటికప్పుడు ఈ విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కింది స్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. పైగా, టీడీపీ వెన్నుపోటు రాజకీయాలూ జనసేన అధినేతను అయోమయంలో పడేస్తున్నాయి.

ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. నిన్నటి మాట ఈ రోజు పాతదైపోవచ్చు. టీడీపీతో జనసేన పొత్తు అంశంపై ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాల్ని సేకరిస్తున్న జనసేనాని, తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారట.