పవన్ కీలక నిర్ణయం… పెదవి విరుస్తున్న సైనిక్స్!

ఒక్కోసారి ఆల్ మొస్ట్ ప్రతీ జనసైనికుడికీ పవన్ తీసుకునే నిర్ణయాలు షాకిస్తుంటాయి. నిత్యం ఆదర్శాలు, ఆదర్శవంతమైన రాజకీయాల గురించి మాట్లాడే పవన్… చేతల్లో మాత్రం వాటికి చాలా దూరంగా ఉంటారెందుకని అంటూ వారిలో వారు మదనపడిపొతూ ఉంటారు. తాజాగా ఆ బాదను మరింత పెంచుతూ… పవన్ మరో కొత్త నిర్ణయం తీసుకున్నారు.

అవును… తాజాగా తన పార్టీ ప్రధాన కార్యదర్శిగా తన సోదరుడు కొణిదెల నాగబాబును నియమించారు పవన్. ప్రస్తుతం జనసేనతోపాటు సమకాలీన రాజకీయాల్లో ఈ వైనం ఆసక్తికరంగా మారింది. నిత్యం నీతులు బోధిస్తూ.. ఆదర్శాలు వల్లిస్తూ వ్యవహరించే పవన్.. తన పార్టీని తన కుటుంబ సభ్యుడికి కీలక పదవిని ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. పవన్ వల్లించే ఆదర్శాల్ని చూసినప్పుడు… కుటుంబ సభ్యులకు పార్టీలో కీలక స్థానాల్లో కూర్చోబెట్టకూడదు. కానీ.. అందుకు భిన్నంగా నాగబాబు పార్టీలో కీలక పదవిని అప్పగిస్తూ పవన్ నిర్ణయం తీసుకున్నారు.

ఇదే క్రమంలో… పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాతో పాటు.. ఎన్నారై సేవల్ని పార్టీకి ఉపయోగపడేలా సమన్వయం చేసే బాధ్యతను మెగా బ్రదర్ కు అప్పగించటం గమనార్హం.

దీంతో… ఒక్కసారిగా పెదవి విరుస్తున్నారు సిన్సియర్ జనసైనికులు. ఎందుకంటే… ఎన్నికలు సమీపిస్తున్న వేల ఒకవైపు అధికార పార్టీ దూకుడు ప్రదర్శిస్తుంది. నిత్యం ప్రజల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. గత ఎన్నికల్లో 151 సీట్లు వచ్చి బలంగా ఉన్నా కూడా… మరోసారి ఆ నెంబర్ దిగకూడదని ఎన్నికల పనులు మొదలెట్టేసింది. మరోపక్క గత ఎన్నికల్లో వచ్చిన 23 షాక్ నుంచి తేరుకుని.. ఈసారి ఆ ఫిగర్ మార్చాలని టీడీపీ కూడా దూకుడు పెంచింది. చినబాబు పాదయాత్రతో.. చంద్రబాబు బహిరంగ సభలతో బిజీగా ఉన్నారు.

కానీ… జనసేన మాత్రం పదేళ్ల కిందట ఎక్కడుందో.. ఇప్పటికే అక్కడే ఉంది! ఒక వాహనం యాడ్ అయ్యింది.. తప్ప కొత్తగా జరిగిన మార్పేమీ లేదు. పవన్ దృష్టిలో ఏదైనా భారీ మార్పు, పెను సంచలన మార్పు, పార్టీ దశ దిశ మార్చేసే మార్పు ఇది అని… నాగబాబు కు పదవి ఇవ్వడం గురించి భావిస్తున్నారో ఏమో తెలియదు కానీ…. ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం… 2019 ఫలితాలు రిపీట్ అవుతాయనడంలో సందేహం లేదని చెబుతున్నారు విశ్లేషకులు.

https://youtu.be/TzU-W6y7-yc