కథాకళిలో ఉప్మాకథ… నాగబాబు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి!

రాజకీయాల్లో అర్థజ్ఞానానికీ అజ్ఞానానికీ మధ్య కొట్టిమిట్టాడుకుంటూ జ్ఞానులం అనే భ్రమలో కొంతమంది జీవిస్తుంటారు! తమకు చాలా విషయాలు తెలుసు అని భ్రమిస్తుంటారు! ఫలితంగా… తమ అజ్ఞానాన్ని బహిరంగ పరుస్తుంటారు! ప్రస్తుతం జనసేన నేత నాగబాబు ఇలాంటి ప్రయత్నమే చేసి సక్సెస్ అయ్యారని అంటున్నారు పరిశీలకులు.

పార్టీ ట్విట్టర్ ఖాతాలో “కథాకళి” పేరుతో ఒక వీడియోని వదులుతుంటారు నాగబాబు. ఆ వీడియోలో రాజకీయంగా తనకున్న జ్ఞానం మొత్తాన్ని బహిరంగ పరిచే ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో భాగంగా… తాజా కథాకళిలో “ఉప్మాకథ” పేరుతో ఒక కంపేరిజన్ అంటూ ఒక ప్రయత్నం చేశారు. దీంతో… ఆన్ లైన్ వేదికగా నాగబాబుని ఆటాడుకుంటున్నారు నెటిజన్లు.

ఒక హాస్టల్లో 100 మంది పిల్లలున్నారట. వారికి ప్రతిరోజు టిఫిన్‌ గా ఉప్మానే చేస్తున్నదట యాజమాన్యం. ప్రతిరోజు ఉప్మా తప్ప మరేమీ ఉండదా.. అంటూ విద్యార్ధులు గోల చేశారట. అయితే ఇందులో 20 మంది మాత్రం ఉప్మాను ఇష్టంగా తింటుంటారట. అయినా మిగిలినవాళ్ళ గోల భరించలేక యాజమాన్యం దిగొచ్చి రకరకాల టిఫిన్లు చెప్పిందట. ఓటింగ్ పెడతాం.. ఎక్కువ మంది పిల్లలు ఏ టిఫిన్ కావాలని అంటారో అదే టిఫిన్ రెడీ  చేస్తామన్నారు.

అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్లు ఉప్మా కావాలని 20 మంది ఓటేస్తే మిగిలిన పిల్లల్లో కొందరు మసాలా దోసె, పూరీ, చపాతి, ఆలూ పరాట లాంటి వాటికి ఓట్లేశారట. అయితే ఎక్కువమంది పిల్లలు అంటే 20 మంది ఉప్మాకే ఓటు వేశారు కాబట్టి మళ్ళీ ఉప్మానే చేస్తామని యజమాన్యం చెప్పిందట. ఉప్మా వద్దనే పిల్లలు 80 మంది ఉన్నా ఏకతాటిపైన లేకపోవటంతో మళ్ళీ ఉప్మానే తినాల్సొచ్చిందట.

ఇది నాగబాబు చెప్పిన ఉప్మా కథ. ఎందుకయ్యా అంటే… తాజా రాజకీయా పరిస్థితులను జనాలకు అర్ధమయ్యేలా చెప్పడం కొసమంట.

అవును… తాజా రాజకీయాలకు ముడిపెట్టి ఉప్మా ముఖ్యమంత్రి జగన్‌ ను వద్దని మెజారిటీ జనాలు మొత్తుకుంటున్నట్లు నాగబాబు చెప్పారు. ప్రతిపక్షాలు గనుక ఏకతాటిపైకి రాకపోతే మళ్ళీ ఉప్మా ముఖ్యమంత్రే అధికారంలోకి వస్తారని చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ నాగబాబు గమనించాల్సిందేమిటంటే…. జగన్ 20% ఓట్లతో ముఖ్యమంత్రి అవ్వలేదు. విపక్షాలు విడివిడిగా పోటీచేయడం వల్ల లాభపడి సీఎం అవ్వలేదు. 2019 ఎన్నికల సమయానికి ఏపీ ప్రజలు ఫిక్సయిపోయారు. జగన్ ను సీఎం చేయాలని నిర్ణయించుకున్నారు.

ఆ ఎన్నికల్లో జగన్ కు వచ్చిన ఓట్ల శాతం… 49.95. అంటే 50 శాతం! వచ్చిన సీట్లు 151. అంటే… 86శాతం! మరి ఈ స్థాయిలో జగన్ విక్టరీ కొడితే… దానికి నాగబాబు చెబుతున్న ఉప్మా కథ ఎలా సూటవుతుంది? అరకొర ఓట్లతో, ముచ్చుక్కోడి సీట్లతో ముఖ్యమంత్రి అయినవాళ్లకు ఇది వర్తిస్తుంది తప్ప… భారీ విక్టరీ సాధించిన జగన్ కు ఎలా వర్తిస్తుందో నాగబాబుకే తెలియాలి.

ఇక్కడ నాగబాబు గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… వైసీపీ తరుపున గెలిచిన ఆ 151 మంది ఎమ్మెల్యేల్లో 97మంది ఎమ్మెల్యేలు 50% కంటే ఎక్కువ ఓట్లు సంపాదించుకోగా… జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ కి వచ్చిన ఓట్ల శాతం 32.92! కాగా, వైసీపీకి వచ్చిన ఓట్లు 32.91%! అంటే.. రాజోలులో జనసేనకు వచ్చిన ఒక్క సీటు ఉప్మాకథకు సెట్ అవుతుందే తప్ప…జగన్ కి వచ్చిన 151 సీట్లు, 50% ఓట్లు సూటుకాదు. ఈ విషయం నాగబాబుకి తెలియాలని, తెలుసుకోవాలని, ఆ స్థాయి జ్ఞానం దేవుడు అనుగ్రహించాలని కోరుతున్నారు నెటిజన్లు!

కథాకళి -  ఉప్మా కథ  | JanaSena Party | Naga Babu Konidela || Dial News