చంద్రబాబు భయాన్ని ఫుల్ గా క్యాష్ చేసుకుంటున్న జనసేన!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ ముహూర్తాన్న వైనాట్ 175 అన్నారో కానీ… అప్పటినుంచి చంద్రబాబులో ఒక అభద్రతా భావం, మరోరకం భయం కమ్ముకున్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఉమ్మడి రాష్ట్రానికి రెండు సార్లు, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కు ఒక సారి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఆ స్థాయి భయం రావడానికి జనసేన కారణంగా చెబుతున్నారు.

అవును… ఈసారి గెలుపు అనివార్యం, ఈ సారి గెలవకపోతే పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అనే విషయం గ్రహించిన చంద్రబాబు జాగ్రత్తలు తీసుకోవడం వరకూ ఓకే కానీ… టీడీపీ కంటే జనసేనే బలమైన పార్టీ అని నమ్మేస్థాయికి దిగజారిపోయారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో చంద్రబాబుకున్న భయాన్ని జనసేన ఫుల్ గా క్యాష్ చేసుకుంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

టీడీపీకి బలమైన నియోజకవర్గాలు అంటూ కొన్ని ఉన్నాయి. పైగా అవి డిసండింగ్ ఫ్యాక్టర్ లాంటి నియోజకవర్గాలు. 2019లో ఫ్యాన్ గాలికి అవి కూడా కొట్టుకుపోయినా… ఈసారి పరిస్థితి మరీ అలా ఉండకపోవచ్చని నమ్మకంగా చెబుతున్నారు తమ్ముళ్లు. తమ్ముళ్లను నమ్మకం ఉంది కానీ చంద్రబాబుకు మాత్రం అది లేదని తెలుస్తుంది.

ఫలితంగా టీడీపీ కంచుకోటలను సైతం జనసేనకు వదలడానికి సిద్ధపడుతున్నారంట చంద్రబాబు. ఇప్పుడు చంద్రబాబు ఒకే లెక్కలో ఉన్నారని అంటున్నారు పరిశీలకులు. కాపు ఓటు బ్యాంకు ఎక్కువగా నియోజకవర్గాలు, తక్కువగా ఉన్న నియోజకవర్గాలు అని కంపేర్ చేసుకోవడం… కాపులు ఎక్కువగా ఉన్నారంటే అది జనసేన అడిగిందంటే ఇచ్చేయడం చేస్తున్నారని తెలుస్తుంది.

ఇందులో భాగంగానే భీమిలీ, గాజువాక, పెందుర్తి, అనకాపల్లితో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో అతిముఖ్యమైన, టీడీపీ కంచుకోటలను సైతం వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఇందులో భాగంగా… పాలకొల్లును సైతం వదులుకోవడానికి చంద్రబాబు సిద్దపడుతున్నారని అంటున్నారు. జనసేన ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారని తెలుస్తుంది.

పైగా జనసేన నాయకులు టీవీ చర్చాకార్యక్రమాల్లో… ఉమ్మడి గోదావరి జిల్లాలో 34సీట్లూ జనసేనే పోటీ చేయబోతోంది… కాకపోతే వాటిలో పదో పరకో పొత్తులో ఉన్న పార్టీలకు ఇస్తాం అనే మాట కూడా అనేశారు. దీంతో… చంద్రబాబు భయాన్ని జనసేన గట్టిగానే క్యాష్ చేసుకుంటుందని.. ఫలితంగా బాబు తెలిసి తెలిసి టీడీపీ ఫ్యూచర్ కు దెబ్బకొడుతున్నారని అంటున్నారు పరిశీలకులు.