రాజ్యాధికారానికి దారిదే… జనసైనికులకు సంక్రాంతి శుభవార్త!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది. దీంతో ప్రధానపార్టీల దృష్టంతా ఇప్పుడు అభ్యర్థుల ఎంపికపై ఉంది. ఇందులో భాగంగా ఎవరితోనూ పొత్తులోలేని వైసీపీ… గతంలో ఎన్నడూ లేనివిధంగా అన్నట్లుగా ఇన్ ఛార్జ్ లను మారుస్తుంది. అభ్యర్థుల ఎంపికలో సమూల మార్పులు చేపడుతుంది. ఈ సందర్భంగా అలిగిన వారు పార్టీని వీడుతుండగా.. అర్ధంచేసుకున్నవారు పార్టీలో కంటిన్యూ అవుతున్నారు.

మరోపక్క టీడీపీ – జనసేన కలిసి ఈసారి బరిలోకి దిగబోతున్నాయి. 2024లో 2014 ఫలితాలు సాధించాలని, కుదిరితే బీజీపీని కలుపుకుపోవాలని పరితపిస్తున్నాయని తెలుస్తుంది. ఆ విషయం ప్రస్తుతం స్పష్టత అస్పష్టంగా ఉందనేది తెలిసిన విషయమే. అయినప్పటికీ బీజేపీలో ఉన్న బాబు శ్రేయోభిలాషులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని అంటున్నారు. ఈ సమయంలో టీడీపీ-బీజేపీ మధ్య సీట్ల సర్ధుబాటు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

టీడీపీ – జనసేన ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని.. కాపు ఓట్లను గంపగుత్తగా ఈ కూటమికి మళ్లించాలని ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో వారు అనుకున్నది అనుకున్నట్లు జరగాలంటే… జనసేనకు కేటాయించే సీట్లు అత్యంత కీలకం. ఈ సీట్ల కేటాయింపుపైనే జనసైనికులు, కాపు సామాజికవర్గ ఓటర్ల నిర్ణయం పూర్తిగా ఆధారపడి ఉండే అవకాశం ఉంది.

మొదట్లో చెప్పినట్లుగా జనసేనకు ఇరవై, పాతిక సీట్లు మాత్రమే ఇస్తే అది టీడీపీకి కూడా తీవ్ర నష్టం అనే చర్చ రాజకీయవర్గాల్లో మొదలైపోయింది. మొదటినుంచీ కాపు నాయకులు, హరిరామజోగయ్య వంటి సీనియర్లు చెబుతున్నది ఇదే. టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే.. అప్పుడు జనసేన సైతం కీలక భూమిక పోషించే అవకాశం ఉండే విధంగా టిక్కెట్లు కేటాయిస్తేనే కాపు సామాజికవర్గ ఓటర్లు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది.

అలా కాకుండా… జనసేనను ఆటలో అరటిపండులా చూస్తే అది కచ్చితంగా కూటమికి అతిపెద్ద దెబ్బనే విషయం ఇప్పుడు పవన్ తో పాటు చంద్రబాబు కూడా గ్రహించారని అంటున్నారు. ఇది కచ్చితంగా జనసైనికులకు సంక్రాంతి నాడు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఇందులో భాగంగా జోగయ్య చెబుతున్నట్లు 60కి తగ్గకుండా, గతంలో వినిపించినట్లు 25కి పెరగకుండా కాకుండా… మధ్యస్థంగా 40సీట్లకు తగ్గకుండా జనసేనకు కేటాయించే సూచనలు ఉన్నాయని అంటున్నారు.

ఇప్పుడు ఈ నెంబర్ కాపుసామజికవర్గాన్ని జనసేనవైపు తిప్పే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. కారణం… నలభై సీట్లు జనసేనకు ఇస్తే ఏపీలో హంగ్ రావడం ఖాయమనేది ఇక్క్డ కీలకమైన వాదన. ఫలితంగా… కూటమిగానే ప్రభుత్వం ఏర్పాటు చేయడం తప్ప టీడీపీకి మరో ఆప్షన్ ఉండదదు!!

అందువల్లే కాపులు ఇపుడు పట్టు బిగిస్తున్నారు అని అంటున్నారు. ఫలితంగా పవర్ షేరింగ్ కి కూడా అవకాశం ఉండొచ్చని చెబుతున్నారు. ఇందులో భాగంగా చాలా మంది కాపు నాయకులు కోరుకుంటున్నట్లు రెండున్నరేళ్లు పవన్ కి, రెండున్నరేళ్లు చంద్రబాబుకి అధికారపీఠాన్ని అదిరోహించే అవకాశం ఉందని చెబుతున్నారు. సో… ఈ సంక్రాంతికి ఇది జనసైనికులకు గుడ్ న్యూసే!!