జనసేన క్యాండిడేట్స్ రెడీ… పోటీచేసే అసెంబ్లీ, లోక్ సభ స్థానాలివే!

ఏపీలో ఎన్నికలకు పార్టీలు సిద్దం అవుతున్నాయి. అభ్యర్దుల ఖరారు పైన తుది కసరత్తు చేస్తున్నాయి. ఈ విషయంలో అధికార వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల విషయంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టగా.. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్ల సర్ధుబాటుపై ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ సమయంలో 28 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో జనసేన పోటీ ఉంటుందని అంటున్నారు.

వాస్తవానికి జనసేన ఇంకొన్ని స్థానాలను డిమాండ్ చేసినప్పటికీ… 2019 ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చిన స్థానాలతో పాటు 2009లో ప్రజారాజ్యం గెలిచిన స్థానాలను కూడా బేరీజు వేసుకుంటూ ఫైనల్ గా ఈ స్థానాలకు కమిట్ అయినట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే 28 స్థానాలపై ఇరుపక్షాలకూ క్లారిటీ వచ్చిందని తెలుస్తుంది. ఇదే సమయంలో… అనకాపల్లి, మచిలీపట్నం లోక్ సభ స్థానాలు కన్ ఫాం అయినట్లు చెబుతున్నారు.

వాస్తవానికి నరసాపురం లోక్ సభ స్థానం నుంచి నాగబాబు.. జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే… సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోసం ఆ సీటు జనసేన త్యాగం చేసిందా అనే చర్చ వెస్ట్ లో మొదలైంది. దీంతో నాగబాబు లోక్ సభకే పోటీ చేయాలని భావిస్తే… అనకాపల్లి, మచిలీపట్నంలలో ఒక చోట నుంచి పోటీ చేయాల్సి వస్తుంది!

తాజా సమాచారం ప్రకారం… జనసేనకు కేటాయించినట్లు చెబుతున్న 28 నియోజకవర్గాల్లోనూ 21 స్థానాలకు అభ్యర్థులు ఫైనల్ అయ్యరని కథనాలొస్తున్నాయి. ఈ జాబితా ప్రకారం…

గాజువాక – సుందరపు సతీష్

భీమిలి – పంచకర్ల సందీప్

నీలిమర్ల – లోకం నాగ మాధవి

గజపతినగరం – పడాల అరుణ

యలమంచిలి – సుందరపు విజయకుమార్

పెందుర్తి – పంచకర్ల రమేష్ బాబు

రాజానగరం – బత్తుల బలరామకృష్ణ

రాజమండ్రి రూరల్ – కందుల దుర్గేష్

కాకినాడ రూరల్ – పితాని నానాజీ

పిఠాపురం – ఉదయ్ శ్రీనివాస్

రామచంద్రాపురం – చిక్కం దొరబాబు

జగ్గంపేట – పటంశెట్టి సూర్యచంద్ర రావు

ముమ్మిడివరం – పితాని బాలకృష్ణ

రాజోలు – డీఎంఆర్ శేఖర్

నరసాపురం – బొమ్మిడి నాయకర్

భీమవరం – కొణిదెల పవన్ కల్యాణ్

తణుకు – వీ రామచంద్ర రావు

తాడేపల్లిగూడెం – బొలిశెట్టి శ్రీనివాస్

తెనాలి – నాదెండ్ల మనోహర్

విజయవాడ వెస్ట్ – పోతిన మహేష్

గిద్దలూరు – ఆమంచి శ్రీనివాస రావు