జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ మృతి చెందినట్టు వార్తలు వెలువడ్డాయి. పుల్వామా దాడిలో మసూద్ అజర్ కీలక పాత్ర పోషించారు. మసూద్ అజర్ మరణించినట్టు పాక్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. అయితే దీనిని పాక్ ఇప్పటికి అధికారికంగా ప్రకటించలేదు. గత కొంత కాలంగా అజర్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. దాంతో పాటు రెండు కిడ్నీలు కూడా ఇటీవల ఆయనవి చెడిపోయాయి.ఆయనకు రెగ్యులర్గా డ యాలిసిస్ అవసరమని , అతను పాక్ ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని కూడా చెబుతున్నారు. అయితే అజర్ భారత్ జరిపిన దాడుల్లోనే గాయపడి చికిత్స పొందుతూ చనిపోయాడని తాజా రిపోర్ట్ లు చెబుతున్నాయి..
మసూద్ అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యారని పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి ఇటీవల ప్రకటించారు. అయితే మసూద్ అజర్ మృతి పై పాక్ ఇంకా స్పష్టతనివ్వలేదు. ఇది పాకిస్థాన్ ప్రణాళికలో భాగమా లేక నిజంగానే మసూద్ మరణించాడా అనేది తెలియాల్సి ఉంది. మసూద్ అజర్ ను తమకు అప్పగించాలని భారత్ ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో పాక్ ఈ విధంగా కొత్త నాటకానికి తెరతీసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.