మంత్రులకు జగన్మోహన్ రెడ్డి మొదటి క్యాబినెట్ సమావేశంలోనే స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అవినీతికి సంబంధించి మంత్రులంతా జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. ఏ శాఖలో అవినీతి జరిగిన తాను సహించనంటూ స్పష్టంగా చెప్పారు. ఆయా శాఖల్లో జరిగే అవినీతికి మంత్రులదే బాధ్యత అని కూడా జగన్ ఫిక్స్ చేసేశారు.
సోమవారం సచివాలయంలో మొదటిసారిగా క్యాబినెట్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కరప్షన్ ఫ్రీ స్టేట్ గా తన పాలన ఉండాలన్న ఆలోచనను మంత్రుల ముందు ఆవిష్కరించారు. అవినీతిని నియంత్రించగలిగితే రాష్ట్రం అభివృద్ధి అవుతుందన్నారు.
అవినీతిని నియంత్రించాలంటే ముందు రాజకీయ అవినీతిని కంట్రోల్ చేయటమే మార్గమన్నారు. రాజకీయ అవినీతిని కంట్రోల్ చేయగలిగితే అధికార యొంత్రాంగం కూడా మెల్లిగా దారికి వచ్చేస్తుందన్నారు. ఎక్కడైనా అవినీతి జరిగిందని బయటపడితే మంత్రులపైనే ముందుగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. దాంతో ఇదే విషయంపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతోంది. పైగా ఇదే విషయాన్ని డిప్యుటి సిఎం ఆళ్ళనాని స్వయంగా మీడియాతో పంచుకోవటం విచిత్రం.