జగన్ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 3,000 కి.మీ. పాదయాత్ర మైలు రాయిని రీచ్ అయింది. మండుటెండల్లో, జోరు వానలో కూడా ఆయన విరామం తీసుకోలేదు. పాదయాత్రలో చాలా యాక్టివ్ గా నడుస్తారు. అలుపు లేకుండా స్పీచ్ ఇస్తారు. రోజులో ఆయన నడక మొదలైనప్పటి నుండి చివరిదాకా ఆయన ముఖంలో అలసత్వం కనిపించదు. బడలిక కనిపించదు. సాయంత్రం వరకు నవ్వుతూనే కనిపిస్తారు.
ఇదంతా ఎలా సాధ్యం? రోజంతా పాదయాత్ర చేస్తున్న కొంచం కూడా అలుపు లేకుండా, చివరి దాక యాక్టివ్ గా ఎలా ఉంటున్నారు. అలసట అనేదే కనిపించకుండా పాదయాత్రలో అభిమానులతో మాట్లాడతారు, భారీ సభల్లో ప్రసంగాలు ఇస్తారు. ఇంత ఎనర్జీ ఎలా వస్తుంది. హెల్త్ పాడవకుండా ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఆయన హెల్త్ సీక్రెట్ ఏమయ్యుంటుంది అనేది చాలామంది జగన్ అభిమానులకి, నేతలకి, కార్యకర్తలకి, సామాన్య ప్రజలకి ఉన్న సందేహం.
వీటన్నిటికీ సమాధానం దొరికింది. జగన్ హెల్త్ సీక్రెట్ తెలిసింది. జగన్ తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా కొన్ని వ్యాయామాలు, ఆహారపు అలవాట్లు పాటిస్తారట. ఆయన పాదయాత్ర ప్రారంభించినప్పటి నుండి ప్రతి రోజు ఆయన దినచర్య ఒకేలా ఉంటుంది. రాత్రి పడుకోవడం ఎంత లెట్ అయినా ఆయన ఖచ్చితంగా తెల్లవారుఝామున 4:30 కు నిద్ర నుండి మేల్కొంటారు.
ఆ తర్వాత ఒక గంటసేపు వ్యాయామం చేస్తారు. కాలకృత్యాలు ముగించుకుని 6:30 – 7:00 వరకు న్యూస్ పేపర్ చదువుతారు. అది పూర్తయ్యాక ముఖ్యమైనవారితో ఫోన్ మాట్లాడతారు. ఏడున్నర ఆ సమయంలో పార్టీ నేతలు, మరి కొందరు ముఖ్యమైన వారితో భేటీ అవుతారు. ఇవన్నీ పూర్తయ్యాక ఆ రోజు పాదయాత్ర మార్గాన్ని, ఏ టైం కి ఏ ప్రాంతంలో ఉండాలి అనే విషయాలు కనుక్కుంటారు.
ఇక ఆయన భోజనం విషయానికి వస్తే…
ఉదయం ఒక గ్లాస్ జ్యూస్ తాగి పాదయాత్ర ఆరంభిస్తారు. అల్పాహారం తీసుకోరు. మధ్యాహ్నం ఆయన భోజనం మెనూ కొన్ని పండ్లు, కప్పు పెరుగు అంతే. రాత్రి ఒకటి లేదా రెండు పుల్కాలు పప్పు, కూరతో తీసుకుంటారు. నిద్రపోయేముందు ఒక కప్పు పాలు తాగుతారు. ఇంత తక్కువ ఆహారంతో ఆయన రోజంతా పాదయాత్ర అలసిపోకుండా చేస్తున్నారని అభిమానులు షాక్ అవుతున్నారు. ఆహరం మితంగా తీసుకుంటూ, ఎక్కువ వ్యాయామం చేయడమే ఆయన యాక్టివ్ నెస్ కి కారణమని తెలుస్తోంది.