‘జగనన్న విద్యాదీవెన’ పథకం వాయిదా పడింది. ఏపీలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం సీఎం బిజీ షెడ్యూల్ కారణంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ రోజు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల డబ్బులు జమ చేయాల్సి ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ కారణంగా జగనన్న విద్యా దీవెన పథకం తాత్కాలికంగా వాయిదా పడింది. త్వరలో జగనన్న విద్యా దీవెన పథకం అమలు కొత్త తేదీని అధికారులు ప్రకటించనున్నారు