మహిళా దినోత్సవానికి మోడీ మార్కు కానుక రెడీ!

ఈ నెల 8వ తేదీన మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రధాని మోడీ… ఒక భారమైన కానుకను దేశ మహిళా లోకానికి అందించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసాయో లేదో.. సామన్యుడి నడ్డి విరిచే పని మొదలుపెట్టేశారు ప్రియతమ ప్రధాని. అంబానీ – అదానీ లాంటి బడాబాబులను మాత్రమే దృష్టిలో పెట్టుకోవడం వల్ల సామాన్యుల సమస్యలు గుర్తుకురావో ఏమో కానీ.. ఉన్నపలంగా 50 రూపాయలు – 350.50 రూపాయలు చొప్పున గ్యాస్ సిలెండర్ ధర పెంచేసింది మోడీ సర్కార్!

సామాన్యుల నడ్డి విరిచే విషయంలో ఏమాత్రం రెండో ఆలోచన చేయకుండా ముందుకుపోయే మోడీ సర్కార్… గృవసరాలకు వినియోగించే సిలెండర్ పై 50 రూపాయలు.. హోటల్లు, రెస్టారెంట్లలో వాడే కమర్షియల్ సిలెండర్ పై 350.50 రూపాయల పెంచింది. అంటే పదేళ్ల కిందట దాదాపుగా 400 రూపాయలుగా ఉన్న గ్యాస్ సిలెండర్ ధరను.. మోడీ సర్కార్ రూ.1200కు పెంచింది.. అంటే సుమారు 170శాతం పెరుగుదల అన్నమాట!

అవును… ప్రతిపక్షాల బలహీనతే వారి బలమో.. లేక, నన్నెవడ్రా అడిగేది అనే మొండితనమో.. లేక పేదోళ్లను కొట్టి పెద్దోళ్లను సేవ్ చేయాలనే కార్యక్రమంలో భాగమో తెలియదు కానీ… ఊహించని రీతిలో గ్యాస్ సిలెండర్ ధరలు పెంచుకుంటూ పోతుంది బీజేపీ సర్కార్! చెప్పే మాటలకు – చేసే పనులకు ఏమాత్రం పొంతన లేదన్నట్లుగా సాగుతున్న ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విమర్శలు జోరందుకున్నాయి.

ఈ నిరంకుశ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ… ఈ నెల 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయిస్తున్నాయి ప్రతిపక్షాలు. మరి ఈ విషయంపై ఏపీ బీజేపీ నేతలు – వారి మిత్రబృదం జనసేన నాయకులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి!