Chiranjeevi: ఉమెన్స్ డే స్పెషల్… శ్రీ లీలకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన చిరు… నటి పోస్ట్ వైరల్!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మహిళా దినోత్సవం సందర్భంగా నటి శ్రీ లీలకు అద్భుతమైన కానుకను అందజేశారు. ఇలా చిరంజీవి తనకు ఇచ్చిన గిఫ్ట్ కి సంబంధించిన వివరాలను అలాగే కొన్ని ఫోటోలను శ్రీ లీల సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతున్నాయి. మరి చిరంజీవి శ్రీ లీలకు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారు అనే విషయానికి వస్తే…

ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి విశ్వంభరా సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు అయితే అన్నపూర్ణ స్టూడియోలో శ్రీ లీల కూడా మరో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు ఈ క్రమంలోనే కాస్త టైం దొరకడంతో శ్రీ లీల విశ్వంభర సెట్ కి వెళ్లారు. అక్కడ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఇలా శ్రీ లీల తమ సెట్ కి రావడంతో చిరంజీవి సైతం ఆమెకు సాలువ కప్పి సత్కరించారు.

ఇక ఆరోజు మహిళా దినోత్సవం కావడంతో ఆమెకు దుర్గా దేవి రూపం ఉన్న శంఖాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శ్రీ లీల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.విత్ ఓజీ.. మన శంకర్ దాదా ఎంబీబీఎస్.. స్పెషల్ గిఫ్ట్‌ ఇచ్చినందుకు, మంచి ఫుడ్ పెట్టినందుకు థ్యాంక్స్ అంటూ ఈమె చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక శ్రీ లీల కూడా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ఈ నెల 28వ తేదీ ఈమె హీరో నితిన్ తో కలిసిన రాబిన్ హుడ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా కాకుండా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడిందని తెలుస్తోంది. అదేవిధంగా మాస్ హీరో రవితేజతో కలిసి మాస్ జాతర అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇలా తెలుగు సినిమాలతో పాటు ఈమె బాలీవుడ్ సినిమాలకు కూడా కమిట్ అయిన సంగతి తెలిసిందే.