షాకింగ్ న్యూస్: వైసీపీ నేత అంబటి రాంబాబుకు జగన్ వార్నింగ్

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకవైపు పాదయాత్ర చేస్తూనే నియోజకవర్గాల ఇంచార్జీలపై దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసారు జగన్. తొలుత గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుండి మార్పు ప్రక్రియను మొదలు పెట్టిన జగన్ ఇప్పటికే జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేశారు.

కాగా జగన్ దృష్టి ఇప్పుడు అదే జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంపై పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సత్తెనపల్లి నియోజకవర్గ ఇంచార్జ్, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబుకు జగన్ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం కింద ఉంది చదవండి.

నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించిన జగన్ నియోజకవర్గాల్లో బలహీనంగా ఉన్న నేతలను పిలిచి పలు సూచనలు, హెచ్చరికలు చేస్తున్నారు. పనితీరు మెరుగు పర్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని మందలిస్తున్నారు. ఈ క్రమంలోనే అంబటి రాంబాబుతో ఇటీవలే భేటీ అయ్యారు జగన్. పని తీరు మెరుగు పరుచుకోవాలని సూచనలు, సలహాలు ఇచ్చినట్టు సమాచారం.

అంబటి సారధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ప్రజాదరణ బాగానే ఉంది కానీ అంబటి తీరు పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉందని జగన్ సూచించినట్లు తెలుస్తోంది. నెలరోజులు గడువు ఇచ్చి, సత్తా చూపించుకోవాలని ఆదేశించినట్టు సమాచారం. ఈలోగా ఫలితం చూపించకుంటే నియోజకవర్గ బాధ్యతలను వేరొకరికి అప్పగిస్తానని హెచ్చరించారట జగన్. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపే ముఖ్యమని, గెలిచేవారే తనకి అవసరమని జగన్ ఖరాఖండిగా తేల్చి సెప్పినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ విషయం ఇప్పుడు సత్తెనపల్లి రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే జగన్ గుంటూరు జిల్లాలో పార్టీకి ఎప్పటి నుండో కృషి చేస్తున్న నేతల్ని పక్కన పెట్టేసారు. గుంటూరు పశ్చిమ టికెట్ ఆశించిన లేళ్ల అప్పిరెడ్డిని పక్కన పెట్టి గెలుస్తారు అనే నమ్మకంతో కొత్తగా పార్టీలో చేరిన మాజీ పోలీసు అధికారి ఏసురత్నం కు టికెట్ ఖరారు చేశారు. ఇక చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్ ను కాదని ఎన్నారై మహిళ రజిని విడుదలకు అవకాశం ఇచ్చారు. ఇక తీరు మార్చుకోకపోతే అంబటికి కూడా వేటు తప్పదు అని వైసీపీ శ్రేణుల్లో టాక్.