వరద బాధితులను పంటు ద్వారా పరామర్శిస్తున్న జగన్..

ఇటీవలే కోనసీమ జిల్లాలలో తీవ్రమైన వర్షాలతో వరదలు ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో ఎంతో నష్టం జరగగా అక్కడి ప్రాంతాలను పరామర్శించడానికి ముఖ్యమంత్రి జగన్ తాజాగా ముందుకు వచ్చారు. గోదావరి వరద ముంపు ప్రాంతాల బాధితులను పరామర్శించడానికి జగన్.. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పంటు ద్వారా బయలుదేరారు.

ఆ తర్వాత అధికారులు, ప్రతినిధులతో కలిసి ట్రాక్టర్ లో లంక గ్రామాల పర్యటనకు చేరుకున్నారు. ఇక అక్కడ వరద బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న సహాయక చర్యల గురించి తెలుసుకున్నారు. అంతేకాకుండా వరద ప్రభావంతో అక్కడ చుట్టుపక్కల జరిగిన పరిస్థితులను కూడా పరిశీలించారు. ఇక వరద బాధితులతో సమావేశం కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. దీంతో బాధితులు తాము పడుతున్న బాధల గురించి, అవస్థల గురించి జగన్ కు చెప్పుకుంటున్నారు.