షర్మిలని జగన్ ఎలా పిలుస్తాడో తెలుసా?

కుల మతాలకు అతీతంగా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల జరుపుకునే పండుగ రాఖీ. తనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండమని సోదరుడిని కోరుతూ సోదరి రాఖీ కడుతుంది. రాఖీ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక.

దేశమంతటా రాఖీ వేడుకలు జరుగుతున్నాయి. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే వారి సోదరీమణులే కాక పార్టీలోని మహిళా నేతలు, అభిమానించే ఆడపడుచులు ఈరోజు రాఖీలు కట్టి తమ నాయకుడిపై వారికి ఉన్న అభిమానాన్ని చాటుకుంటారు.

ఎంతమంది రాఖీ కట్టినా తమ తోడబుట్టిన వారు ఆరోజు దగ్గర లేకపోతే ఆ లోటు లోటే. ఇదే పరిస్థితి వైసీపీ అధినేతకి ఎదురైంది. ఎంతమంది రాఖీ కట్టినా ఆయనకి కూడా తన చెల్లితో రాఖీ కట్టించుకోవాలని మనసులో ఉంటుంది కదా. సోదరితో ఈరోజు కొంత సమయం గడపాలని ఉంటుంది కదా…

ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా యలమంచిలిలో పాదయాత్ర చేస్తున్న జగన్ తన చెల్లిని కలుసులేకపోయారు. దీంతో షర్మిల జగన్ కు రాఖీ కట్టలేదు. జగన్ ఆవేదనతో షర్మిలని మిస్ అవుతున్నట్టు ఒక ట్వీట్ పెట్టారు. ‘రాఖీ రోజు నిన్ను మిస్ అవుతున్నాను “షర్మి పాప”. ఈ అన్న బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడూ ఉంటాయి. రక్షాబంధన్ శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల్లోని సోదరీమణులందరికి రాఖీ శుభాకాంక్షలు -మీ జగనన్న’ అంటూ ట్వీట్ చేశారు జగన్. జగన్ షర్మిలను, షర్మిల పాప అంటూ పిలవటంతో జగన్ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఆ ట్వీట్ కింద ఉంది చూడండి.

 

Missing you on Rakhi, Sharmipapa. Blessings always – Anna. Happy #Rakshabandhan

Wishing all my sisters in the Telugu states, a very happy #Rakhi – Mee Jagananna.

— YS Jagan Mohan Reddy (@ysjagan) August 26, 2018