జనసేన సభలకు దొరకని అనుమతులు.. జగన్ టార్చర్ మామూలుగా లేదుగా?

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్ష పార్టీలను తొక్కేసే దిశగా అడుగులు వేస్తున్నారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీల సభలకు అనుమతులు ఇవ్వాలని జగన్ అనుకోవడం లేదని తెలుస్తోంది. చంద్రబాబు సభకు తాజాగా ఇబ్బందులు సృష్టించిన జగన్ సర్కార్ జనసేన సభలకు కూడా ఇబ్బందులు క్రియేట్ చేసే దిశగా అడుగులు వేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

జనసేన పార్టీ శ్రీకాకుళంలో యువశక్తి కార్యక్రమం నిర్వహిస్తుండగా ఈ కార్యక్రమానికి పోలీసుల నుంచి అనుమతులు లభించలేదు. జనసేన సభలకు అనుమతులు లభించకపోవడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వం అమలు చేయడానికి ప్రయత్నిస్తున్న జీవో నంబర్ 1 పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భయంతోనే జగన్ సర్కార్ అనుమతులు ఇవ్వట్లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

జగన్ సర్కార్ జీవోలు చీకటి జీవోలు అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చంద్రబాబు చేసిన తప్పులకు అందరినీ శిక్షించడం కరెక్ట్ కాదని మరి కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు వల్ల 11 మంది చనిపోయినా ఆయనలో అణువంతైనా ఆ బాధ లేదనే సంగతి తెలిసిందే.

జగన్ సర్కార్ ఈ జీవో విషయంలో మరీ కఠినంగా కాకుండా కొంతమేర జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్ ప్రజల కోసం ఎన్నో మంచి స్కీమ్స్ ను అమలు చేశారనే సంగతి తెలిసిందే. అయితే జనసేన, టీడీపీ నేతలకు మాత్రం జగన్ పై కోపం అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.