జమిలి ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కళ్లు కాయలు కాచేలా ఎదురుచస్తున్నారు. ప్రధాన నరేంద్ర మోదీ దేశమంతా ఒకేసారి ఎన్నికలు అనేసరికి చంద్రబాబు ఆ ఎన్నికలు ఎప్పుడొస్తాయా! జగన్ మోహన్ రెడ్డి ని ఎప్పుడు ఢీ కొడదమా? అని ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే జమిలి ఎన్నికలు ప్రస్తావనకు వచ్చాయి. కానీ అప్పుడు వాటి అవసరం చంద్రబాబుకు లేదు..కానీ ఇప్పుడు అత్యంత అవసరం కాబట్టి వెయిట్ చేస్తున్నారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ సహా పలు రాష్ర్టాల్లో జరగాల్సిన ఎన్నికలు…తాజా కరోనా పరిస్థితులను విశ్లేషించుకుని చూస్తే జమిలి ఎన్నికలు మూడేళ్లలో వచ్చే అవకాశం ఉందని ఇటీవల జోరుగా ప్రచారం సాగింది.
కేంద్రం కూడా కసరత్తులు ప్రారంభించినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో చంద్రబాబు నాయుడు ఆశలు రెట్టింపు అయ్యాయి. వన్ నేషన్…వన్ రేషన్ తరహా లో జమిలి ఎన్నికలు కూడా షురూ అయిపోతాయని చంకలు గుద్దుకుంటున్నారు. కానీ వాటి వెనుక సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తే చాలా సంగతులే ఉన్నాయన్నది నిపుణుల మాట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందు చెప్పడం కష్టం. అలా రాష్ర్టాల్లో ప్రభుత్వాలు అన్ని కుప్పకూలిపోతే..ప్రతీసారి జమిలి ఎన్నికలు అనడం సరి కాదుగా. అలాగని రాష్ర్టానికి తక్కువ కాల పరిమితితో మళ్లీ ఎన్నికలంటే అదీ కష్టమైన పనే. ఈ నేపథ్యంలోనే జమిలి ఎన్నికలపై క్లారిటీ మిస్ అవుతున్నట్లు కనిపిస్తోంది.
ఇవన్నీ ఆలోచిస్తే జమిలి ఎన్నికలు సాధ్యమేనా ? అని కచ్చితంగా ప్రశ్నించుకోవాల్సిందే. కాబట్టి చంద్రబాబు కల సాకరం అనేది అంత ఈజీ కాదు. బీజేపీని విబేధించిన చంద్రబాబు మళ్లీ ఆ పార్టీ పంచన చేరాలని భావిస్తోన్న సంగతి తెలిసిందే. ఒంటరిగా ఉన్న తమని ఆదుకోవాలని ఆ పార్టీ శ్రేణులు బీజేపీ భజన మొదలు పెట్టారు. ఇవన్నీ కూడా జమిలి ఎన్నికలు కోసం వేస్తోన్న ఎత్తుగడ అని ఇప్పటికే వైసీపీ నేతలు ఆరోపించారు. అసవరం కోసం కాళ్లు…అవసరం తీరిన తర్వాత జుట్టు పట్టుకునే రకమని ఇప్పటికే చాలా విషయాల్లో చంద్రబాబు అడ్డంగా దొరికి సందర్భాలు కోకొల్లలే కదా.