చంద్రబాబుకు చెక్ పెట్టేలా జగన్ నిర్ణయాలు.. అనుకున్నది సాధించారా?

YS Jagan Knows

ఈ మధ్య కాలంలో ఎక్కడ పడితే అక్కడ బహిరంగ సభలను నిర్వహిస్తూ ప్రజల్లో తనకు ఏ మాత్రం పాపులారిటీ తగ్గలేదని ప్రూవ్ చేసుకోవడానికి చంద్రబాబు పడుతున్న కష్టం అంతాఇంతా కాదు. అయితే చంద్రబాబుకు చెక్ పెట్టే దిశగా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా జగన్ సర్కార్ రోడ్లపై సభలు నిర్వహించకూడదంటూ ఆదేశాలు జారీ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. మూడు రోజుల వ్యవధిలో 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది.

పవన్ కళ్యాణ్ కు కూడా ఈ నిబంధనల వల్ల నష్టమేనని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రూల్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తే మాత్రమే ఈ తరహా ఘటనలు పునరావృతం కావని జగన్ సర్కార్ భావిస్తోంది. ఈ ఘటనల వల్ల తమ ప్రభుత్వంపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు రావడం జగన్ సర్కార్ ను మరింత బాధ పెట్టిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్ల రాబోయే రోజుల్లో ఈ తరహా ఘటనలు మరింత ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో జగన్ సర్కార్ కఠిన నిబంధనలను అమలు చేయడానికి సిద్ధమైంది. అదే సమయంలో జరుగుతున్న ఘటనల వల్ల చంద్రబాబు సభలకు హాజరు కావాలంటే టెన్షన్ పడాల్సిన పరిస్థితి నెలకొందని సామాన్య ప్రజల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

భారీ కానుకలు ఇస్తామంటూ చంద్రబాబు ప్రాణాలు తీశారని ప్రజలు చెబుతున్నారు. హోం శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో నిబంధనల అమలు విషయంలో పోలీసులు సైతం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. షరతులు ఉల్లంఘించే వాళ్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు.