బాబు, కరువు కవలపిల్లలు.. జగన్ విమర్శలపై చంద్రబాబు సమాధానం ఏంటో?

కొన్ని విమర్శలు వినడానికి కొత్తగా అనిపించినా అనుభవం ఉన్నవాళ్లు ఆ విమర్శల్లో ఎంతో నిజం ఉందని చెబుతారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న రైతు భరోసా స్కీమ్ వల్ల రైతులకు ఎంతగానో బెనిఫిట్ కలుగుతోందనే సంగతి తెలిసిందే. సంవత్సరానికి 13,500 రూపాయలు ఖాతాలలో జమవుతూ ఉండటంతో రైతులు సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు. అయితే ఈ మొత్తంలో 6000 రూపాయలు పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా అందుతున్నాయి.

ఆళ్లగడ్డ పబ్లిక్ మీటింగ్ లో జగన్ మాట్లాడుతూ చంద్రబాబు, కరువు కవలపిల్లలని చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి . జగన్ సర్కార్ కౌలు రైతులతో పాటు దేవాదాయ భూములను సాగు చేస్తున్న రైతులకు సైతం రైతు భరోసా స్కీమ్ ను అమలు చేస్తూ ప్రజలకు మరింత దగ్గరవుతోంది. జగన్ చెప్పిన విధంగానే బాబు పాలనలో రైతులు ఏనాడూ సంతోషంగా లేరనే సంగతి తెలిసిందే,

బాబు అధికారంలో ఉన్న సమయంలో సకాలంలో వర్షాలు కురవకపోవడం వల్ల రైతులు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. బాబు 14 సంవత్సరాల పాటు అధికారంలో ఆ 14 ఏళ్లు ఇదే పరిస్థితి కొనసాగింది. జగన్ పాలనలో మాత్రం వర్షాలు బాగానే కురుస్తూ ఉండటంతో వ్యవసాయంపై ఆధారపడిన రైతులు పెద్దగా ఇబ్బందులు పడటం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చంద్రబాబు రుణ మాఫీ విషయంలో మోసం చేశారని కామెంట్లు జగన్ కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్ల విషయంలో చంద్రబాబు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. చంద్రబాబు పాలనతో పోల్చి చూస్తే జగన్ పాలన ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంది. జగన్ పాలనలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు కరెక్ట్ గా అందుతున్నాయి. ఈ విషయంలో జగన్ గ్రేట్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.