AP: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా పింఛన్లను భారీగా పెంచేశారు. ఇక చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఆయన ఎన్నికల హామీలలో భాగంగా చెప్పిన విధంగానే పెంచిన పింఛన్లతో సహా అందరికీ పంపిణీ చేశారు అయితే తాజాగా పింఛన్లను తొలగిస్తారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ అవుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఫించన్ల తొలగింప పట్ల స్పందించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారందరికీ కూడా పెన్షన్ అందడమే మా ప్రభుత్వ ధ్యేయమని తెలియజేశారు అయితే గత ప్రభుత్వ హయామంలో ఎంతో మంది అనర్హులకు కూడా పెన్షన్లను పంపిణీ చేసిందని తద్వారా ప్రతినెల కొన్ని కోట్ల భారం పడుతుందని తెలిపారు. ముఖ్యంగ దివ్యాంగుల పెన్షన్లలో భాగంగా ఇలాంటి అవకతవకలు జరిగాయని తెలిపారు.
ఎమ్మెల్యేలతో పాటు.. అధికారుల నివేదికల్లో కూడా ఇదే అంశం స్పష్టం అవుతోంది. దీంతో పింఛన్ల తనిఖీ చేపట్టనున్నారు..ఇదే సమయంలో అనర్హులకు ఫించన్లు ఇవ్వడం సరికాదని అన్నారు. ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనే విషయం తేలాలంటే నిర్థిష్టమైన నిబంధనలు అమలవ్వాలన్నారు. అనర్హులను తొలగించేందుకు పూర్తిస్థాయిలో పింఛన్ల తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టాలని చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఇలా తమ ప్రభుత్వం పింఛన్ల తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టడంతో కొంతమంది దీనిని పింఛన్లు తొలగిస్తున్నారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరైతే అనర్హులుగా ఉండి పెన్షన్లను తీసుకుంటున్నారో అలాంటి వారికి తప్పనిసరిగా చర్యలు తప్పవని అలాంటి వారిని ప్రోత్సహించిన డాక్టర్లపై కూడా వేటు తప్పదని తెలిపారు. ఇక కొత్తగా పెన్షన్లకు అర్హులైన వారందరికీ పెన్షన్ అందించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.