బీఆర్ఎస్ ఎంట్రీతో జగన్ సంచలన నిర్ణయం.. తెలంగాణలో పార్టీలకు షాకేనా?

తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అభిమానించే అభిమానులు లక్షల్లో ఉన్నారు. తెలంగాణలో జగన్ వైసీపీని కొనసాగించి ఉంటే ఆ పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లను సాధించి ఉండేది. అయితే తెలంగాణలో వైసీపీ పోటీ చేయడం వల్ల టీ.ఆర్.ఎస్ పార్టీ నష్టపోయే అవకాశం ఉండటంతో వైసీపీ ఆ విషయంలో వెనక్కు తగ్గింది. అయితే ఏపీలో కేసీఆర్ బీ.ఆర్.ఎస్ పార్టీని పోటీ చేయించాలని అనుకుంటున్నారు.

అన్ని స్థానాలలో కాకపోయినా బలమైన అభ్యర్థులు ఉన్న స్థానాలలో ఈ పార్టీ పోటీ చేసే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. అదే సమయంలో తెలంగాణలో వైసీపీ పోటీ చేస్తే కనీసం 10 శాతం సీట్లలో గెలిచే ఛాన్స్ అయితే ఉంటుంది. ఏపీలో బీ.ఆర్.ఎస్ తెలంగాణలో వైసీపీ ఎంట్రీ ఒకే సమయంలో జరగనున్నాయని తెలుస్తోంది. జగన్ వైఎస్సార్టీపీకి మద్దతు ఇచ్చే ఆలోచనలో మాత్రం లేరని బోగట్టా.

వైఎస్సార్టీపీ తెలంగాణలో గెలవడం సులువైన విషయం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణం వల్లే షర్మిలకు మద్దతు ఇచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదని జగన్ అనుకుంటున్నారు. తెలంగాణలో వైసీపీ పోటీ చేసే విషయమై జగన్ ఆలోచిస్తున్నారని త్వరలో ఇందుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం అందుతోంది. వైసీపీ అమలు చేస్తున్న పథకాలపై తెలంగాణలో మంచి అభిప్రాయం ఉంది.

2024 అసెంబ్లీ ఎన్నికల సమయానికి తెలంగాణ రాజకీయాలలో ఇంకెన్ని మార్పులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. వైసీపీ ఎంట్రీ ఇస్తే మాత్రం తెలంగాణలో టీ.ఆర్.ఎస్ కు టెన్షన్ మొదలవుతుంది. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయమో కాదో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు.