ఉద్యోగులలో వ్యతిరేకత తగ్గించేందుకు జగన్ సంచలన నిర్ణయం.. కానీ?

ఏ రాష్ట్రంలోనైనా రాజకీయ పార్టీ అధికారంలోకి రావడంలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారు. అయితే జగన్ సర్కార్ విషయంలో ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు సీరియస్ గా ఉన్నారు. పీఆర్సీ విషయంలో, సీపీఎస్ విషయంలో జగన్ సర్కార్ వ్యవహరించిన తీరు ఉద్యోగులకు ఆగ్రహం తెప్పించింది. జగన్ సర్కార్ పై వ్యతిరేకత పెరగడానికి వేర్వేరు కారణాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. అయితే టీచర్లలో కోపం తగ్గించే దిశగా తాజాగా ఏపీ సర్కార్ అడుగులు వేసింది.

10,000 మంది టీచర్లకు పదోన్నతులు కల్పిస్తూ జగన్ సర్కార్ తాజాగా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇందుకు సంబంధించి షెడ్యూల్ ఖరారైందని తెలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల 7,000 మంది టీచర్లు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందనుండగా ఎంఈవో పోస్టులను రెట్టింపు చేస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జగన్ సర్కార్ నిర్ణయంతో జెడ్పీ స్కూల్ టీచర్లు ఎంఈవోలుగా ప్రమోషన్ పొందనున్నారని తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా 53 డిప్యూటీ డీఈవో పోస్టులు ఉండగా ఈ పోస్టులకు అదనంగా 36 డిప్యూటీ డీఈవో పోస్టులకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. జగన్ సర్కార్ నిర్ణయంతో 2300 మంది ఉద్యోగులకు బెనిఫిట్ కలగనుందని తెలుస్తోంది. జగన్ సర్కార్ నిర్ణయం విషయంలో ఉపాధ్యాయులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. ప్రభుత్వ ఉద్యోగులలో ప్రభుత్వంపై వ్యతిరేకత తగ్గకపోతే ప్రభుత్వానికే నష్టమని చెప్పవచ్చు.

2024 ఎన్నికల సమయానికి ఉద్యోగులలో వ్యతిరేకత పోగొట్టుకునే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేయాల్సి ఉంది. ప్రభుత్వం వ్యతిరేకతను తగ్గించుకోని పక్షంలో జగన్ సర్కార్ కు తీవ్రస్థాయిలో నష్టం కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. జగన్ సర్కార్ భవిష్యత్తు నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. జగన్ సర్కార్ పేద ప్రజలపై దృష్టి పెడుతూ ఇతర వర్గాలను నిర్లక్ష్యం చేస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.